*ఈ సూర్యుడి కిరణాలు ఆ నిర్మాణం పై బాగానే ఉన్నాయి..
*నేతాజీ మాటలు నీతి మాటలకే పరిమితం…
*వారానికి ఎన్నిరోజులో…
*స్లాబ్ వేసింది నాలుగు రోజులు…
*నోటీసు మాత్రం జనవరిలో ఇచ్చారు..
*ఈ నెల13వతేది పిర్యాదు ఇస్తే
*జనవరిలోనే నోటీసులు ఇచ్చారు..
*ఇదంతా మహమాయనా…మున్సిపాలిటీ చట్టమా…
*అక్రమాలకు అడ్డాగా పట్టణ ప్లానింగ్ శాఖ…
*ఇంకెప్పుడు మారేది వీరి తీరు…
- వీరి అవినీతి కి అడ్డు అదుపూ ఉండదా…
- శివాలయంవీధి బిల్డింగ్ సిత్రాలే వేరయా ..
(రామమోహన్ రెడ్డి)
“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని “అగ్గితోడు కడుగు ఈ సమాజ జీవచ్చాన్ని”మారదు లోకం..”అని సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన విధంగా అవినీతి ,నయవంచన, అక్రమం,ఉద్యోగం లో నిర్లక్ష్యం, పారదర్శకత లేని విధానం, విధానపరమైన నిర్ణయాలు, లోపభూయిష్టంగా ఉంటూ అవినీతి కంపులో మునిగిపోయిన వ్యవస్థ లతో ప్రజలు ఎప్పుడూ భంగపాటు గురికాక తప్పదు.డబ్బు ఉన్నవాడీకే న్యాయం పలుకుబడి ఉన్నోడిదే సామ్రాజ్యం అన్న లోకొత్తర అధర్మం నాటి నుంచి నేటి వరకు విలయతాండవం చేస్తుంది. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందని అంటేప్రజల కష్టాన్ని జీతాల రూపంలో తీసుకుంటూ కూడా అవినీతి సొమ్ము కోసం అర్రులు చాచుతూ అది అక్రమని తెలిసినా కూడా తమ సంచులు నింపుకుని సక్రమని సాకులు చెప్పే ప్రయత్నం చేయడం చూస్తే సమాజం సిగ్గుతో తలదించుకోక తప్పడం లేదు.బెజవాడ పురపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్ని ఇన్ని కావనే యదార్ధ దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నా కట్టడి చేయలేని కూటమి ప్రభుత్వం లో ప్రజలు ఉన్నారని చెప్పుకుంటే సిగ్గుతో తలదించుకోవాలి.ఈ గుంటూరు కారం మహా ఘాటు గురూ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.బెజవాడ ప్రధాన వ్యాపార కేంద్రమైన వన్ టౌన్ ఏరియా శివాలయం వీధి లోని ఈ నిర్మాణం చూసై ఈ అధికారుల అవినీతి అట్లే అర్ధమవుతుంది. ఈ నిర్మాణం వారే అక్రమని అన్ని నోటీసులు ఇస్తారు… ఆ నోటీసులు కూడా జనవరి నెలలో ఇచ్చినట్లు దిద్దుతారు.ఆ నిర్మాణం అక్రమ మా సక్రమమా అని పిర్యాదు ఇస్తే అందుకు బదులుగా నోటీసులు ఇస్తారు.ఇంత లోపాయి కరంగా ప్రబుత్వ యంత్రాంగం పని చేస్తుంటే ప్రజలకి ఏమి న్యాయం జరుగుతుందని ఆశించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్లానింగ్ సెక్రటరీ కనుసన్నల్లోనే బీల్డింగ్ ఇన్స్పెక్టర్ అండదండలతో ఇలా జరుగుతున్నాయని అక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారన్నదే ప్రధాన ప్రశ్న గా మిగిలిపోయింది. అక్కడ ఉన్న ఆరుడగుల బుల్లెట్, నేతాజీ మాటలకు చేతలకు పొంతన లేదనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అయినా చర్యలు మాత్రం సున్యమేనా అన్నది వినిపిస్తోంది. గతం తాలూకు అక్రమాలపై ఇప్పటికే లోకాయుక్తకు పిర్యాదు చేయడానికి కొందరు సిద్ధం కాగా ఈ అధికారుల తీరు మారక పోవడం శోచనీయం.