గొల్లప్రోలు
అలబండ దాడిలో గాయపడిన చేబ్రోలు లో ని కర్రి వారి వీధికి చెందిన చేదులూరి సత్యవేణి కు పరిహారం ఇవ్వాలని అటవీశాఖధికారులను కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాధ్ ఆదేశించారు. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే గ్రామం లో పర్యటించి బాధితురాలు నుండి వివరాలు సేకరించారు. గ్రామం లో అలబండ సంచారాన్ని గుర్తించారు. ఎంపీ ఆదేశాలు మేరకు కాకినాడ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్ భరణి సంఘటనలో గాయపడిన సత్యవేణి కు పరిహారం ఇవ్వాలని రాజమండ్రి సర్కిల్ చీఫ్ కాన్సెర్వెటర్ ఆఫీసర్ కు విన్నవించారు. గ్రామం లో సంచరిస్తున్న అలబండలు, కోతుల ను పట్టుకుని గ్రామానికి ఐదు కిలోమీటర్లు దూరం లో వున్న వజ్రాకుటం అడవిలో విడిచిపెట్టెందుకు సహకారం అందించాలని కోరారు.