గండేపల్లి:స్థానిక గండేపల్లి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా యు వి శివ నాగబాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రాజానగరం, బొమ్మూరు, రాజమండ్రి 3 టౌన్ ,గోకవరం పోలీస్ స్టేషన్ల లో విధులు నిర్వహించారు. సాధారణ బదిలీ లలో భాగంగా గండేపల్లి పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన ఎస్సై నౌడు రామకృష్ణ బదిలీపై కాకినాడ వెళ్లారు.

