Thursday, September 4, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఖాకీల చేతిలోకి కలం

ఖాకీల చేతిలోకి కలం

*ఖాకీల కలహాలు బైట పెట్టేదే కలం
*అలాంటి కలం నేడు కలంకితం అయ్యిందా ..అయ్యేలా చేస్తున్నారా.. చేసారా..
*కత్తి కన్నా కలం గొప్పదన్నారు..
*అలాంటి కలానికే కలుషితం చేసేదెవరు…చేస్తున్నదెవరు..
*న్యాయమా అన్యాయమా అన్నది నలుగురికీ తెలియజెప్పక…
*నలుగురి నోళ్ళలో ఏమిటీ అన్యాయం అనిపించు కుంటుంటే…
*మన సమస్యలే బోలెడుంటే ..ప్రజా సమస్యలను పైకి చూపించే దెన్నడు…
*మనలోనే ఇన్ని లోపాలుంటే ఇతరుల లోపాలను ఏలెత్తి చూపగలరా..
*అసలు నాయకత్వ మంటే ఏమిటీ…
*నలుగురికి మేలు చేయలేని నాయకత్వంతో ఉపయోగ మేమిటీ..
*దేనికోసం అందరికి కాదు కొందరికే అన్న వాదం…
*ఎవడి సొమ్ముకు ఎవడు బాద్యుడు…
*ఓ కళహ ప్రియులారా కలానికెందుకు ఇంత కళంకితం తెస్తారు…
*ఓ కాలమా కలానికెంత కానీ తెచ్చి పెట్టేరే…
*ఈ కాలం కలానికి తప్పదు కష్ట కాలం…
*ఏమిటా కస్టం… ఎందుకంత కష్టం…ఎందుకు ఎవరిష్టం.. వారిస్టం…
(రామమోహన్ రెడ్డి)

“The pen is mightier than the sword”అవును, “కలం కత్తి కంటే శక్తివంతమైనది” అనేది ఒక ప్రసిద్ధ సామెత. దీని అర్థం, మాటలు, రాతలు, ఆలోచనలు భౌతిక బలం (కత్తి) కంటే ఎక్కువ శక్తివంతమైనవి. ఆలోచనలు, జ్ఞానం, భావోద్వేగాలు, మరియు సమాచార మార్పిడి ద్వారా ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం కలం కలిగి ఉంటుంది.
ఈ సామెతలో, కలం అంటే రాత మరియు కమ్యూనికేషన్ అని అర్థం, కత్తి అంటే హింస లేదా భౌతిక బలం. కలం ద్వారా వ్యక్తీకరించే ఆలోచనలు, మాటలు, సమాజంలో మార్పులు తీసుకురాగలవు మరియు ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయగలవు. కత్తి కేవలం ఒక వ్యక్తి లేదా సమూహాన్ని శారీరకంగా నియంత్రించగలదు, కానీ కలం ద్వారా వచ్చే ఆలోచనలు మరియు మాటలు ప్రపంచాన్ని మార్చగలవు.
కత్తి కంటే కలం శక్తివంతమైనది ” అనేది సామాజిక లేదా రాజకీయ మార్పుకు సాధనంగా హింస కంటే వ్రాసిన పదం మరింత ప్రభావవంతంగా ఉంటుందని సూచించే వ్యక్తీకరణ. ఈ భావన వేల సంవత్సరాలుగా వ్రాత సాధనాలు మరియు ఆయుధాల రూపక వైరుధ్యాలతో వ్యక్తీకరించబడింది.కలం కత్తి కంటే శక్తివంతమైనది” అనే నిర్దిష్ట పదజాలాన్ని మొదట 1839లో ఆంగ్ల రచయిత ఎడ్వర్డ్ బుల్వర్-లైటన్ ఉపయోగించారు.అంటే 18 శతాబ్దంలో నే కలం యొక్క గొప్పదనాన్ని వివరించడం జరిగింది.అయితే ఇక్కడ ఇప్పుడు కలం కంటే కత్తి దే గొప్పది అన్నట్లుగా పరిస్థితి దాపురించింది. కారణం కలానికి కూడా కులం, మతం,జాతీ వర్ణం అన్నిటిని ఆంటగట్టి తమ స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం బహుళ ప్రయోజనాలను బలిచేస్తున్న బలమైన శక్తులు పనిచేస్తున్నాయి.ఇదంతా కొంత కాలమే అన్నది జగమెరిగిన సత్యమైన కేవలం అహంకారపు ధోరణి ఆలోచన లేని విధానాలు అందరి వారిగా కాకుండా కొందరి వారిలాగే మిగిలి పోతామన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం కూడా ఒక కారణం అవ్వచ్చు.
ఇక అందరూ నాయకులే.నాయకుడు అంటే అర్థం కూడా సరిగా తెలియని,తెలుసుకోలేని, తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేని వారున్న పరిస్థితుల్లొ కలం కొట్టు మిట్టాడుతూ ఉంది.నాయకుడు అంటే పరిస్థితులు ఎలా మెరుగుపడతాయో చూడగలడు మరియు ఆ మెరుగైన దృక్పథం వైపు ప్రజలను సమీకరించేవాడు. నాయకులు తమ దృక్పథాన్ని నిజం చేసుకునేందుకు ప్రజలను ముందు ఉంచుతూ పని చేయవచ్చు. ప్రజలను ప్రేరేపించగలగడం మాత్రమే సరిపోదు — నాయకులు విజయం సాధించడానికి సానుభూతి కలిగి ఉండాలి మరియు ప్రజలతో కనెక్ట్ అవ్వాలి. నాయకులు ఒకే నేపథ్యం నుండి రావాల్సిన అవసరం లేదు లేదా అదే మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. భవిష్యత్ నాయకులు వాస్తవానికి మరింత వైవిధ్యంగా ఉంటారు, ఇది విభిన్న దృక్పథాలను తెస్తుంది. వాస్తవానికి, ఇతర వ్యక్తులు నా నిర్వచనంతో విభేదించవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సంస్థలు వారి నాయకత్వ నిర్వచనంతో అంతర్గతంగా ఐక్యంగా ఉంటాయి. కానీ ఇక్కడి నాయకులు చెప్పిందే వేదమనే బ్రమలో వారు బ్రతుకుతూ వారికి బాకా కొట్టే వారిని కూడా అదే బ్రమల్లో బ్రతకేలా చేస్తున్నారు.ఇది ఇక్కడి అసలైన సిసలైన నాయకత్వం.
“సంఘం” అంటే సమాజం లేదా సమూహం అని అర్థం. ఇది సాధారణంగా ఒకరితో ఒకరు అనుబంధం లేదా సాధారణ ఆసక్తులు లేదా లక్ష్యాలను పంచుకునే వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. ఇది ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే ప్రజల సమూహాన్ని లేదా ఒకే విధమైన ఆసక్తులు లేదా అభిరుచులు గల వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది.కానీ ఇక్కడ సంఘమంటే తమ కులానికి తమ అభిమతానికి అనుకూలంగా ఉన్న వారితోనే ఉన్నదానిని సంఘం గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఛాందస్వాదులు.
ఖద్దరు చొక్కా అనేది నాయకులను, వారి సిద్ధాంతాలను మరియు ప్రజలతో వారికున్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది.ఖద్దరు చొక్కా కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అది ఒక భావజాలం, ఒక ఉద్యమం, మరియు ఒక సాంస్కృతిక చిహ్నం.ఈ ఖద్దరు చొక్కాలు తమ లోపల పడిన చిల్లులను వదిలి ఇతరుల కు చిల్లులు ఎలా వేయాలనే విశాల దృక్పథంతో ఉన్నారన్నది అక్షర సత్యం గా నిలుస్తుంది.
ఇక జర్నలిజం అంటే ప్రజలకు వార్తలు మరియు సమాచారాన్ని సేకరించడం, ధృవీకరించడం, విశ్లేషించడం మరియు అందించడం. ఇది ఒక వృత్తి మరియు ఒక ప్రక్రియ, ఇందులో సంఘటనలు, వాస్తవాలు, ఆలోచనలు మరియు వ్యక్తుల పరస్పర చర్యలపై నివేదికలను ఉత్పత్తి చేసి, పంపిణీ చేయడం జరుగుతుంది.జర్నలిస్టులు సమాజానికి సేవ చేయడానికి, నిజాయితీగా, నిష్పాక్షికంగా మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దానినే వృత్తిపరమైన నైతికత అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజం బ్రోకరిజం మారి ఒక. వైపు తమ బ్రతుకులను ఛిద్రం చేసుకుంటూ తమతో పాటు అందరి జీవితాల్ని ఛిద్రం చేయాలని చూస్తున్న సంఘటన లే నేడు అధికంగ కనిపియిస్తున్నాయి.కారణం అక్షరజ్ఞానం ఉండదు,సభ్యత సంస్కారం లేని సమాజం పట్ల ,కనీస అవగాహన లేకుండా సంపాదన కు చాలా సులువైన మార్గమనే విధానాన్ని తీసుకువచ్చి జర్నలిజాన్ని పూర్తిగా బ్రోకరిజం, యర్నలిజం గా మార్చారు…మారుస్తూనే ఉన్నారు మేధావిముసుగు వేసుకున్న ముష్టినాయకులు, ముష్టి జర్నలిస్టులు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభం” అనేది ఒక రూపకం, ఇది సాధారణంగా ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను సూచిస్తుంది. ఇది శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థలతో పాటు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పరిగణించబడుతుంది.రాజ్యాంగ వ్యవస్థలు పరస్పర సహకారంతో, ఏ ఆధిపత్య పోరూ లేకుండా పని చేయడం ద్వారా మన ప్రజాస్వామ్యంలోని మూడు స్తంభాలకు శోభ చేకూరుతుంది. చివరిది, నాల్గవ స్తంభం అయిన మీడియా ప్రజాస్వామ్య విలువలను చాటడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ నాలుగు స్తంభాలు రాజ్యాంగబద్ధంగా, పరస్పరం చేదోడు వాదోడుగా ఉండాలి కాని, ఒకరి పరిధిని మరొకరు అతిక్రమించకూడదు. కానీ విభజిత నవ్యాంధ్రప్రదేశ్ లో జర్నలిజం అడ్డుగా పెట్టుకుని నాయకులు గా చెలామణి అవుతున్న వారు అన్నిటికీ మూలమైనది నాలుగో స్తంభం జర్నలిజం అంటుంటే ఈ నేటి నాయకులు నాలుగో స్తంభం విలువను దిగజార్చుతూ మిగిలిన మూడు స్తంభాల వద్ద మోకరిల్లి నాలుగో స్తంభం పరువును నిలువునా తీసేస్తున్నాయి. అలా కాకపోతే ఖాఖీల, ఖద్దర్ కలహాల కుంపట్లను సైతం కలం తో కడిగిపారేసే స్థాయి నుంచి మమ్మల్ని కాపాడండి వారు అది మేము ఇది,మేమే కారణ జన్ములని వారు కాదని కారు కూతలు కూస్తూ చీమల పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు వ్యవహరించడం ఎంత సిగ్గుచేటో అవగతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాగితాల రూపంలో సత్యాలు కనపడుతున్న వాటన్నింటినీ అసత్యాలని ఖాకీల దగ్గర కీచులాట పెడుతున్న ఈ కళంకితులకు కాలమే సమాధానం తప్పక చెబుతుందని ఆశించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article