కామవరపుకోట :అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఎన్నికల అధికారి మొహిద్దిన్ చెప్పారు.
ఎన్నికల విధులలో భాగంగా ఏలూరు జంగారెడ్డిగూడెం మార్గంలో కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద నుండి వెళుతున్న క్యారీ వ్యాన్ ను ఎన్నికల అధికారి మొహిద్దిన్ సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్యారీ వ్యాన్ ను సాధారణంగా రాజకీయ నాయకుల ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉపయోగిస్తూ ఉంటారు. క్యారీ వ్యాన్ అన్ని విభాగాలలో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సత్యవేణి,, ఏఎస్ఐ స్వామి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, సిఐఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.