రౌతులపూడి
రౌతులపూడి మండలం పలు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసుని,ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభను గెలిపించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్, రౌతులపూడి ఎన్నికల ప్రచార ఇంచార్జి కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా సంయుక్త కార్యదర్శి పక్కుర్తి సతీష్,రౌతులపూడి మండల ఉపాధ్యక్షుడు నిజ్జా నాగ సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి షేక్ సలీం,గౌతు గంగాధర్ జన సైనికులు మామిడి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.