Friday, November 14, 2025

Creating liberating content

తాజా వార్తలుకొత్త నేర చట్టాల అమలును ఆపండి.

కొత్త నేర చట్టాల అమలును ఆపండి.

ఐలాజ్ డిమాండ్.

ప్రత్తిపాడు :ప్రస్తుతం అమలులో ఉన్న భారతీయ శిక్షా స్మృతి, 1860; భారతీయ సాక్ష్యాధారాల చట్టం, 1872; భారతీయ నేర విధాన స్మృతి/సంహిత, 1973 రద్దవనున్నాయి. వాటి స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023’, ‘భారతీయ న్యాయ సంహిత, 2023’, భారతీయ సాక్ష్యా అధినియం, 2023’ అనే మూడు కొత్త నేర చట్టాలు జూలై1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త చట్టాలలోని పలు నిబంధనల రాజ్యంగబద్ధతపైఅనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు, నేర దర్యాప్తు సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ పౌరులు సమగ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని, వెంటనే ఈ నేర న్యాయ చట్టాల అమలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాజ్ డిమాండ్ చేసింది. ఐలాజ్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు ప్రత్తిపాడు కోర్టు వద్ద ఐలాజ్ శ్రేణులు ఈ నేర న్యాయ చట్టాల అమలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు.
ఈ మూడు కొత్త నేర చట్టాలను అమలుపరచనుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ మూడు చట్టాలు జూలై 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయని,ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, ముఖ్యంగా వాక్ స్వాతంత్ర్యం, సమావేశమయ్యే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, నిరసన ప్రదర్శనలు చేసే హక్కు, ఇంకా ఇతర పౌర స్వేచ్ఛల ను మరియు ఆర్టికల్ -14,21లను హరించనున్నాయని,రాజ్యాంగాన్ని కాపాడవలసిన చట్టాల్ల్నే రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తయారు చేశారని, ఈ కారణంగానే ఈ కొత్త చట్టాలను న్యాయవాదులు; దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా దేశ పౌరులు సమగ్రంగా చర్చించేందుకు ఒక అవకాశం కల్పించాలని ఐలాజ్ అభిప్రాయపడుతుంది. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ చట్టాలు అమలు చేయాలని అప్పటివరకు నిలుపుదల చేయాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో బుగత శివ ,అవసరాల దేవి, పిల్లి బలరాముడు ,కలవలపల్లి సుజన, రాయి శ్రీనివాసరావు ,గడ్డం కామేశ్వరరావు ,రెడ్నంవెంకటరెడ్డి ,వెంకటలక్ష్మి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article