Wednesday, April 30, 2025

Creating liberating content

టాప్ న్యూస్కేశినేని నానిపై పోటీకి సిద్ధం: కేశినేని చిన్ని

కేశినేని నానిపై పోటీకి సిద్ధం: కేశినేని చిన్ని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కేశినేని నానికి విశ్వాసం లేదని ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని వైసీపీలో చేరడంతో… సైకోలందరూ ఒకే చోటకు చేరినట్టయిందని అన్నారు. విజయవాడ లోక్ సభకు కేశినేని నాని పోటీ చేస్తే కచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడని జోస్యం చెప్పారు. అయితే, విజయవాడ టికెట్ ను నానికి ఇచ్చే అంశంలో వైసీపీ నాయకత్వం ఇంత వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కేశినేని నానికి చాలా గౌరవం ఉండేదని… వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయన స్థాయి దిగజారిందని చిన్ని చెప్పారు. దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా చేశారు. విజయవాడ నుంచి తాను బరిలోకి దిగే అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలని తమ నాయకత్వం సూచిస్తుందో… అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. టికెట్ల కేటాయింపులపై తమ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ చర్చిస్తారని చెప్పారు. కేశినేని నానిపై పోటీకి తాను సిద్ధమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article