Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుకె.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో…మొక్కలు నాటే కార్యక్రమం

కె.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో…మొక్కలు నాటే కార్యక్రమం

కామవరపుకోట :స్థానిక కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు అధ్యక్షతన “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమం లో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు ప్రపంచ పర్యావరణం పరిరక్షణ లో భాగంగా ప్రతీ ఒక్కరు కూడా తప్పని సరిగా మొక్కలు నాటడంతో పాటు బాధ్యత తో సంరక్షించాలని పేర్కొన్నారు. ఎన్ ఎస్ ఎస్ విభాగం కో-ఆర్డినేటర్ డాక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తన మాతృమూర్తి పేరు మీదుగా ఒక మొక్కను నాటి పర్యావరణం పరిరక్షణలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు ఎన్ ఎస్ ఎస్ విభాగం కో-ఆర్డినేటర్ డాక్టర్ జి శ్రీనివాసరావు ఇతర అధ్యాపకులు జి రామ్మోహన్, ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, వి శ్రీనివాస్, ధారావతు మల్లేష్ లతో పాటు ఆఫీస్ సిబ్బంది అన్నపూర్ణమ్మ, రత్న సిరిలో, కుమార్ రాజా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article