కామవరపుకోట
స్థానిక కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
ఎన్ ఎస్ ఎస్ మరియు పొలిటికల్ సైన్స్ విభాగముల సంయుక్త ఆధ్వర్యంలో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు ఓటు హక్కు ప్రాముఖ్యత తెలుసుకోవాలని,ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిడికి గురి కాకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా “ఓటు హక్కు వినియోగం పై ప్రతిజ్ఞ” నిర్వహించిన అనంతరం ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఓటు పై అవగాహన ర్యాలీ” నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాసరావు అధ్యాపకులు ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, వి శ్రీనివాస్, ఎ హర్షవర్ధిని, ఆఫీస్ సిబ్బంది చంద్రమోహన్, అన్నపూర్ణమ్మ, రత్నసిరిలో, కుమార్ రాజా లతోపాటు విద్యార్థిని విద్యార్థులు ఆసక్తి తో పాల్గొన్నారు.