-సోదరులు జోగి రెడ్డి, భరత్, కుమార్ రెడ్డి
-టిడిపిలో భారీ చేరికలు
వేముల
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,ఎంపీ అభ్యర్థి చదివి రాళ్ల భూపేష్ రెడ్డి లకు మద్దతు తెలిపి మీ అమూల్యమైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరిని గెలిపించాలని మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సోదరులు జోగిరెడ్డి,భరత్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ప్రజలను కోరారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చాగలేరు,గుండ్లపల్లి,దుగ్గన్నగారిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ముందుగా మారెడ్డి రవీంద్రనాథరెడ్డి కుటుంబ సభ్యులకు మహిళలు హారతులతో తన స్వాగతం పలికారు.ముందుగా చాగలేరులో ఇల్లూరు ఈశ్వర్ రెడ్డి, సతీష్ రెడ్డి, జయరామిరెడ్డి కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరగా వారికీ రవీంద్రనాథ్ రెడ్డి సోదరులు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మారెడ్డి సోదరులు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావ్వాలని చంద్రబాబుతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని కావున ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.అలాగే జగన్ పరిపాలనలో సామాన్యులు అందరూ ఇబ్బంది పడ్డారని తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే ఆరు గ్యారెంటీలను అమలుపరుస్తామని అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఉందని వారు పేర్కొన్నారు.మండల ఇన్చార్జ్ చిట్టిబోయిన బ్రహ్మయ్య,మండల క్లస్టర్ ఇంచార్జ్ బొగ్గుల భాస్కర్ రెడ్డి, రామచంద్ర, చంటి,నాగేళ్ల చిన్న అంకిరెడ్డి, మండల మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి,నాగభూషణ రెడ్డి,వినోద్ కుమార్ రెడ్డి, గంగాధర్ రెడ్డి,వసంత రెడ్డి,అరికెలా రామకృష్ణ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి,గొల్లలగూడూరు రవి,చిట్టిబోయిన మహేష్,కొండారెడ్డి, ఇల్లూరు శివారెడ్డి,
మండలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

