Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్కూటమిలో కుంపటి

కూటమిలో కుంపటి

  • సత్యవేడులో ధుమారం రేపుతున్న శంకర్ రెడ్డి తీరు..?
  • శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల, జనసేన కేంద్రంగా వీడియోలు హల్ చల్
  • సూళ్లూరుపేటలో జిపి వర్సెస్ ఎమ్మెల్యే కుటుంబం అంతర్గతంగా పోరు అంటూ గుసగుసలు
  • జిల్లా పరిధిలో కషాయ పార్టీ అసంతృప్తులు

తిరుపతి ప్రజాభూమి రీజనల్ బ్యూరో ఇంచార్జ్ వల్లిపి విద్యాసాగర్

ఎమ్మెల్యే పవర్ ఉంటే కూటమిలోని అన్నీ పార్టీలకు సమన్యాయం, కూటమిగా వెలితే విజయం తప్పదు, కలిసి సేవ చేస్తే అనుకోకుండానే పథవులు వరిస్తాయి, తద్వారా తమ వారికి న్యాయం చేయగలం, తమ బ్రతుకులు మారుతాయి. ఇవి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలొ భాగమైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కన్న కళలు.అయితే అప్పుడు ఆశ పడిన వారు ఇప్పుడు బంగ పడడమే కాకుండా,వారు కన్న కళలు అన్నీ కళలుగానే మిగులుతున్నాయి. వారిని నమ్ముకున్న వారికి న్యాయం చేయలేక పోగా తాము కూడా ఆర్ధిక ప్రళయంలో చిక్కుమంటున్నామని చంద్రగిరి, వెంకటగిరి, గుడూరు నియోజనవర్గంలోని జనసేనా, బీజేపీ నేతలు వాపోతున్నారు. సత్యవేడు, సూళ్లూరుపేట, తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దళిత, గిరిజనలకు కల్పించిన రిజర్వేషన్లు సైతం సత్యవేడు నియోజకవర్గం కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి తుంగలో తొక్కి ఆ రిజర్వేషన్లను సైతం అగ్రవర్ణాల వారి వీపులకు రుద్దడం పట్ల సత్యవేడు నియోజకవర్గం పరిధిలో దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో పార్టీలొ కష్టపడిన వారికి తగిన న్యాయం లేకపోగా నేర చరిత్ర కలిగిన వారికి పధవులు పంపకాలు చేయడం పట్ల తెలుగు తమ్ముళ్ళు పెదవి విరుస్తున్నారు.మరో దళిత నియోజకవర్గం సూళ్లూరుపేట పరిస్థితి చూస్తే జిపి, ఎమ్మెల్యే వర్గం చెలిమితో వేనాటి వర్గం, మాజి మంత్రి పరసా వర్గం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే కుటుంబం వర్సెస్ గంగాప్రసాద్ అంతర్గతంగా పోరు జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పుడో ఒకప్పుడు నేరుగా తాడోపెడు తేల్చుకునే పరిస్థితి వస్తుందని రెండు వర్గాల అనుచరులే మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. సత్యవేడు నియోజకవర్గంలో పరిస్థితులు అన్నీ ప్రస్తుత పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి పనితీరుపైనే విమర్శలుగా మారుతు న్నాయి. ఈ క్రమంలొ సత్యవేడు ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉంటే పధవుల్లా సమన్యాయం జరిగేదన్న వాదనలు కూడా బలంగా సత్యవేడు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయ్. ఈ రెండు నియోజకవర్గ పరిస్థితి అలా ఉంటే శ్రీకాళహస్తి నియోజకవర్గం లో మాజీ జనసేన ఇంచార్జ్ వర్సెస్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గం వీడియోలుతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినుత అంతర్గత వీడియోలు కోసం డబ్బులు ఆశ చూపారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై కోట వినూత మాజి డ్రైవర్ చనిపోయిన రాయుడు మాట్లాడినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఆరోపణలు నేపథ్యంలో కొందరు దళిత నాయకులు ఆగమేఘాలపై దళిత ఎమ్మెల్యే పై సస్పెన్స్ వేటి వేసిన తెలుగుదేశం అధిష్టానం అగ్రవర్ణం ఎమ్మెల్యే పై మౌనం వహిస్తుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సస్పెన్షన్ తో రెడ్డి వర్గం ఇంచార్జ్

తిరుపతి జిల్లా పరిధిలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు సత్యవేడు, సూళ్లూరుపేట. అందులో సత్యవేడు నియోజకవర్గ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలబడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నో వ్యతిరేకిస్తూ ఎంపీ టికెట్ కేటాయించిన వదులుకొని నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని తెలుగుదేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, క్యాడర్ వ్యతిరేకించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో టిడిపి టికెట్ తెచ్చుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించి మంచి మెజారిటీతో గెలుపొందారు. కానీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు నియోజవర్గంలోని అగ్రవర్ణాల తెలుగుదేశం క్యాడర్ కుమ్మక్కై ఎమ్మెల్యే పై హనీ ట్రాప్ నిర్వహించి వీడియోలు బయటకు ఎట్టకేలుకోవాలనుకున్నట్టు ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు వేయించారు. ఎలాగోలాగా సదర ఫన్నీ డ్రాప్ ను రాజీ చేసుకున్నా ఎమ్మెల్యే కేసు లేకుండా బయటపడిన అధిష్టానం ఎప్పుడు కరుణిస్తుందా అని ఎదురుచూస్తూ ఎల్లప్పుడూ నియోజకవర్గంలో ప్రజలలో తిరుగుతూ ప్రజాభివృద్ధి కొరకు పాటుపడుతున్నాడు. ఇలా ఎమ్మెల్యే పై సస్పెన్స్ వేటు వేయడంతో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొంతమందిని తెరమీదకు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో రెడ్డి వర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, పార్టీ ఫైనాన్సిల్ గా అండగా ఉండే శంకర్ రెడ్డిని నియోజకవర్గం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా నియమించింది. నాగలాపురం మండలం, సురుటుపల్లిలొ ఉన్న శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆళయ చైర్మన్ పదవి ప్రస్తుతం సత్యవేడు రాజకీ యాలల్లో తీవ్ర దుమార రేపుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని, నిశ్వార్థంగా పార్టీ కోసం సేవ చేసిన వారి అధికార కూటమి మొండి చూపుతుందని కూటమి లోని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే మండి పడుతున్నారు. సురుటుపల్లి ఆళయ బోర్డు చైర్మ న్గా పదవులు ఆశించి బంగ్ల పడిన వారి కంటే కార్య కర్తకలకు ఇది మిం మగుడు పడడం లేదు. దళితుడైన ఆదిమూలంకు పవర్ లేకపోవడంతోనే రిజర్వ్ నియోజకవర్గంలో పెద్దలు దళితులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని సాంత్త పార్టీ నేతలే గొల్లుమంటున్నారు. రెడ్డి సామాజిక వర్గంకు చెందిన శంకర్ రెడ్డి దళితులను పూర్తిగా పధవులకు దూరం చేస్తున్నారని మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని
బుచ్చినాయుడు కండ్రిగ మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులు ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తే స్థానిక పెద్దలు ఆ రిజర్వే షన్లను కాదని సొంత్త రిజర్వేషన్లు మార్పుకుని జనసేన ప్రమాణస్వీకారాలకు సిద్ధం అయ్యారు.అయితే దీనిని వ్యతిరేఖించిన దళిత నేతలు కోర్టుకు వెల్లడంతొ ప్రస్తుతం ఆ పధవుల పై స్టే కొనసాగు తుంది. దళిత నేతలు సత్యవేడుకు నాయకత్వం వహించి ఉన్నా, ఎమ్మెల్యే ఆదిమూలం తమకు అందు బాటులో ఉన్నా ఇలాంటి అన్యాయాలు జరిగేవి కావని నేతలు వాపోతున్నారు. మధ్యం పాపు ఉన్న వ్యక్తిని శివయ్య సేవకు పంపుతున్నారు. ప్రస్తుతం సురుటుపల్లి ఆళయ చైర్మన్ గా నియామకం అయిన దొమ్మరాజు పద్మరాజు అనే వ్యక్తి పేరుతో పన్నూరు సబ్ స్టేషన్ వద్ద మధ్యం షాపు ఉంది. లైసెన్స్ కూడా పద్మ నాభరాజు పేరుతోనే ఉంది. మద్యం సరఫరా కూడా ఆయన పేరుతోనే జరుగు తుంది. అయితే ఈ మధ్యం షాపును ఇటీవలే వేరొకరికి విక్రయించినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఆయనపై పిచ్చాటూరు, కేవీబీపురం మండల పోలీస్ స్టేషన్లలో రైస్ పుల్లింగ్ (రేషన్ బియ్యం ఆక్రమ సరఫరా) కేసులు నమోదై ఉన్నాయి. ఇదే కేసుల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఛీఫ్ సెక్రటరీ గా ఉన్న టీడీ యశ్వంత్ అప్పట్లో పుత్తూరు డీఎసీపీగా పనిచేస్తున్న సమయంలొ ఈయనను ఆరెస్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇది
తెలుసుకున్న పద్మనాభ రాజు పరారీ లొ ఉండి యాంట్ స్పెటరీ బెయిల్ తీసుకుని ఉన్నారు. ఇలాంటి వ్యక్తికి పవిత్రమైన ఆళయ పాలక భాధ్యతలు ఇస్తే అక్కడ జరిగే అన్నప్రసాదం బియ్యాన్ని కూడా పద్మనాభ రాజు మాయం చేస్తారని నియోజకవర్గ నేతలు ఎద్దేవచేస్తున్నారు.

శంకర్ రెడ్డి పై అసంతృప్తి

సత్యవేడు తెలుగుదేశం పార్టీ కో ఆర్డినే టర్గా కొనసాగుతున్న వ్యక్తిపై నియోజక వర్గం నేతలు,కార్యకర్తలు తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. శంకర్ రెడ్డి కేవలం అధికారం అనుభవించేందుకే పార్టీ నియోజకవర్గ పగ్గాలు చేపట్టినట్లు ఉందని, నేతలకు, కార్యకర్తలకు ముఖ్యంగా పార్టీకీ న్యాయం చేసేందుకు, పరిస్థితుల ను చెక్కదిద్దేంకు వచ్చినట్లు లేదని మండి పడుతున్నారు. పార్టీ ఆదేశాలను దిక్కరించి, పార్టీకి వెన్నుపోడిచిన వారినే శంఖర్ రెడ్డి పక్కన పెట్టుకుని వారు చెప్పిన మాటలకు ముక్తుడుగా మారాధని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యే ఆది మూలంకి వ్యతిరేకులకు పధవులు కట్ట బెట్టి, గంగా ప్రసాద్ను వ్యతిరేఖించి నోళ్ళకు మేలు చేసి,పార్టీ నేతలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ అధి ష్టానం ఈ పరిస్థితులను చక్కదిద్దకుంటే తాము పార్టీని వీడడం తప్పా వేరే మార్గం లేదని ఇంకెందరు వాపోతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు మాత్రం కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి.

కూటమి నేతలకు మొండి చెయ్యి

ప్రభుత్వ ఏర్పాటులొ కీలకమైన జనసేన, బీజేపీ నేతలకు సత్యవేడులో ఎమ్మెల్యే పరిస్థితుల తరువాత షాకులు తగులుతున్నాయి. ఆశించిన వారికి బంగ్గ పాటు తప్పడం లేదు. పార్టీ ఒప్పందాల ప్రకారం ఆయా పార్టీలకు చేరాల్సిన పద వులు సైతం టీడీపీ నేతలనే వరిస్తున్నా యి.ఇది ఇరు పార్టీ ముఖ్యనేతలు అసం తృప్తిని వ్యక్త పరుస్తున్నారు. ఎమ్మెల్యేగా తమకు సమాన హక్కులు, గౌరవం ఆదిమూలం కల్పించడమే కాకుండా, తమ పదవులకు సైతం ఎమ్మెల్యే సిఫారు సులు చేస్తూ లెటర్ ప్యాడ్లు ఇచ్చారని సధరు నేతలే వాస్తవాలను బయట పెట్టారు.

ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్త కుంటే

కో ఆర్డినేటర్ గా భాద్యతలు తీసుకున్న శంకర్ రెడ్డి తీరు ఇప్పుడు పార్టీలొ తిరు గుబాటు పరిస్థితులను నెలకొల్పాయి. అసహనంతొ పాటు, అగ్రహంతొ ఉన్న నేతలు కార్యకర్తలు శంకర్ రెడ్డి కార్యక్ర మాలపై తిరుగుబాటు చేసేందుకు సైతం వెనుకాడరు అని సొంత పార్టీలొ జరుగు తున్న చర్చ.అంతే కాకుండా ఇలాంటి పరిస్థితుల్లొ లోకల్ బాడీ ఎన్నికల్లొ పార్టీకి తీవ్రం నష్టం తప్పదన్నది కూటమి నేతల వాదన. కాబట్టి అధిష్టానం ఎమ్మెల్యే ఆది మూలంపై సస్పెన్షన్ ఎత్తితే సమస్యలు అన్నీ కొలిక్కి వస్తాయని నియోజకవర్గం లోని అధికార నేతల గట్టి వాదన ఈ పరిస్థితులపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదొ వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article