హైదరాబాదులోని కూకట్ పల్లి ప్రాంతంలో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ నూతన బ్రాంచి ఏర్పాటు కార్యక్రమానికి టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీలీల హాజరైంది. చక్కగా చీరకట్టులో హాజరైన శ్రీలీల సీఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసింది. శ్రీలీల రాకతో భారీగా జనాలు తరలివచ్చారు. షాపింగ్ మాల్ లోని ఆభరణాలను ధరించి శ్రీలీల ఫొటోలకు పోజులిచ్చారు.