రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు, ఆప్కాస్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి
ప్రజాభూమి పోరుమామిళ్ల:
కుల గణనకు సిద్ధం కావాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు, ఆప్కాస్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. శుక్రవారం పోరుమామిళ్ల పట్టణంలోని డాక్టర్ కళ్యాణ చక్రవర్తి స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూభారతదేశ జనాభాలో సింహభాగం ఉన్న వెనుకబడిన తరగతులు(బీసీ) కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధా నాలతో ఇంకా వెనుకబాటుతనానికి గురవుతున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల గణన కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు, ఆప్కాస్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిలు పేర్కొ న్నారు. కడపజిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి స్వగృహంలో బలిజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీలకు ఇవ్వాల్సినంత శాతం రిజర్వేషన్ ఇవ్వలేదన్నారు.రిజర్వేషన్ సాధన కోసం అనేక సంఘాలు ఉద్యమిస్తు న్నాయన్నారు.బీసీలురాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు అందరం సాగలన్నారు. చాలామంది ఆర్థికంగా ఇంకా వెనుకబడే ఉన్నారు. బీసీల అభివృద్ధికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ర్టాలు ముందుకు వచ్చా యన్నారు. గతరాజకీయ పార్టీ లు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశాయని, బీసీలు తమ హక్కుల సాధన, రాజ్యాధికారం కోసం అనేక ఏండ్లుగా ఉద్యమిస్తున్నా ఐక్యత లేకపోవడం వల్ల హక్కుల సాధనలో వెనుకబడుతున్నారన్నారు. బిసిల అభివృద్ధి, రాజకీయ పదవులు అందించడంలో ఒక్కరే ఆయనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన అభివృద్ధి కోరే వ్యక్తి కి మనం వెన్నుదండుగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈనెల 28 వతేదీన విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ ఐకమత్యంతో ఏకులానికి ఏమి అన్యాయం జరిగింది అనేది నివేదిక రూపంలో అందిస్తే వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. కుల గణనలో అందరూ పాల్గొని అందరిని గణన చేయించాలన్నారు. పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని, మనలో మనం కొట్టుకుంటే నష్టపోయేది మనమే అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చెన్ను రాజశేఖర్, పోరుమామిళ్ల పంచాయతీ ఉప సర్పంచ్ రాళ్లపల్లి నరసింహులు, మాజీ ఉపసర్పంచ్ రాళ్లపల్లి నరసింహులు, సంఘ వసంతరాయులు, మద్దిలేటి, భూతప్ప, వల్లెం పిచ్చయ్య, బొల్లు రామ్మోహన్, తోట ప్రసాద్, భైరప్రసాద్, శంకర్, సురేష్, తదితర బలిజ సామాజిక నాయకులు పాల్గొన్నారు.