మార్కాపురం:మార్కాపురం.స్థానికకిట్స్ఇంజనీరింగ్ కళాశాల లో సోమవారం రోజున మొదటి సంవత్సర విద్యార్థినీ విద్యార్థులకు ఓరియంటేషన్ డే కార్యక్రమం వేడుకను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్న కృష్ణ చైతన్య ఒక ప్రకటనలో తెలియజేశారుఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ అన్న కృష్ణ చైతన్య పాల్గొనిమాట్లాడుతూకళాశాలలో అత్యున్నతమైన సాంకేతికతో కూడిన విద్యతో పాటు విలువలతో కూడినవిద్యనుఅందిస్తున్నామని, విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలన్నారు, కిట్స్ కళాశాలలో చదివేందుకు ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు, అలానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నెలలో ఒకసారి అయినా కాలేజీకి వచ్చి మీ అమ్మాయి/ మీ అబ్బాయి కాలేజీకి సక్రమంగా వస్తున్నారా లేదా అని కనుక్కోవాలని తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు కళాశాలకు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై అధ్యాపకులు బోధించే పాఠాలను విని 100% ఉత్తీర్ణత సాధించాలని జీవితంలో మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీటెక్ లో ఉండే విధి విధానాలు అకాడమిక్ యాంటీ ర్యాగింగ్ చట్టాల గురించి వివరించారు. మా కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మీరు ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రంగనాయకులు, కళాశాల ఏవో బి ప్రభాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పివి అనిల్ కుమార్ వివిధ విభాగపు అధిపతులు పి రామ్మోహన్, డాక్టర్ జెవి అనిల్ కుమార్,కే రాముడు, కే కిషోర్ బాబు, ప్రసన్న మురళి , జే రమణారెడ్డి,ఏ. అమృతవల్లి , పి మనోహర్, ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్ రంగస్వామి, ఎన్ వి ఎస్ ఎన్ అంజనీ కుమార్, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

