ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
మోడీ బిజెపి కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీలలో జింఖానా గ్రౌండ్ లో జరిగే కార్మిక రైతు మహాధర్నా ను విజయవంతం చేయాలని ఉద్యోగ కార్మికుల కు సిఐటియు విజ్ఞప్తి చేసింది . స్థానిక గవర్నర్ పేట బాలోత్సవభవన్ లో శుక్రవారం కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కే , ఎం.వి సుధాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాల వలన కార్మికులు , ఉద్యోగులు , రైతులు,వ్యవసాయ కార్మికులు , ప్రజానీకం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని . ధరలు సూచి పెరుగుదల నిత్యవసర వస్తువుల ధరల ప్రభావాన్ని తెలియజేస్తున్నదన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ లు తెచ్చారని చెప్పారు.ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం,లీజు కి ఇవ్వటం జరుగుతున్నదని రైల్వే , విద్యుత్, టెలికం, బ్యాంకు, బీమా, మౌలిక సదుపాయాల పై ఈ విధానాల దుష్ప్రభావం పడిందన్నారు . రైతు చట్టాలు రద్దు చేసినా రైతాంగానికి ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చలేదని తెలిపారు. లక్షల కోట్ల రూపాయల విదేశీ అప్పుచేశారన్నారు .ఉపాధి కల్పన లేక నిరుద్యోగం పెరిగిందని చెప్పారు . ఆకలి సూచిలో మన దేశ స్థానం దిగజారటం ఆందోళనకరమని తెలిపారు. ప్రజల మధ్య అనైక్యతను పెంచేట్లుగా ప్రభుత్వం తీరు . చరిత్రను వక్రీకరించటం , శాస్త్రీయ విద్యా విధానం మార్చటం, రాజకీయాలలో అవినీతిని , ప్రజాధనం పలు రూపాలలో కొల్లగొట్టడం మోడీ ప్రభుత్వ హయాంలో పెరిగిందని చెప్పారు. ప్రజాస్వామిక హక్కులు కాలరాయటం, రాజ్యాంగంలోని అంశాలు విస్మరించటం, దేశభక్తి మాటున తమ విధానాలను వ్యతిరేకించే వారిని అణిచివేయటం బిజెపి ప్రభుత్వానికి పరిపాటి అయిందన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ రైతు సంఘాలు ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలు సమైక్యంగా ఈనెల 27 నుండిమూడు రోజులపాటు అన్ని రాష్ట్రాలలోనూ నిర్వహిస్తున్నారని చెప్పారు. నగరంలోని జింఖానా గ్రౌండ్ లో రాష్ట్రస్థాయి ధర్నా 27, 28 తేదీలలో జరుగుతున్నదని తెలిపారు. ప్రజా అనుకూల విధానాల కోసం జరుగుతున్న ఈ ధర్నాకు నగర ప్రజానీకం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సీతారాములు, వై సుబ్బారావు, ఎం బాబురావు, టి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు .