సెలబ్రిటీలు ఏంచేసినా అది వైరల్ అయిపోతుంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసే ప్రతి పనీ అది వైరల్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారు. కారు టైర్లపై మార్క్ సిగ్నేచర్ “ఏఏ” మార్కు చేయించారు. అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతుంటాడు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇపుడీ కారు, సిగ్నేచర్ మార్కు ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.