కాపు సామాజిక భవనం కి వైవి సుబ్బారెడ్డి, అవంతి శంకుస్థాపన
విశాఖ:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో భీమిలి నియోజకవర్గం పరిధిలో గల ఎండాడ లో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ముఖ్య అతిథిగా కాపు సామాజిక భవనం నిర్మాణం కై శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. అవంతి పిలుపుతో భీమిలి శ్రేణులు కార్యక్రమం కి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు కి ఘనమైన సాదర స్వాగతం పలకడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలు – గీతాలతో అలరించడం జరిగింది. అనంతరం అర ఎకరంలో అంచనా విలువ 50 కోట్లు రూ లతో నిర్మించబోయే కాపు సామాజిక భవనం కి వైవి సుబ్బారెడ్డి, అవంతి వేద పండితులు మంత్రోచ్చారణ మద్య భూమి పూజ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ళ నుంచి కాపులు చాలాకాలంనాటి కల అయిన కాపు సామాజిక భవనం నిర్మాణం పట్టువదలని విక్రమార్కుడు లా ముఖ్యమంత్రి అడిగి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామాజిక భవనం నిర్మాణం జరగడం చాలా సంతోషం గా ఉందని విశాఖ జిల్లా కాపు నేతలు అవంతి కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి కాపు సామాజిక భవనం నిర్మాణం కై అర ఎకరం స్థలం కెటాయించిన ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.

మన జీవితం శాశ్వతం కాదు మనం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఏదైనా మన పాలనతో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి శాశ్వతం అని,గతంలో నేను ఇప్పటి ప్రతిపక్షం పార్టీ లో ఉన్నప్పుడు సం కి ఒక నియోజకవర్గం అబివృద్థికి కేవలం 4 కోట్లు నిధులు మంజూరు చేస్తే వైసిపి ప్రభుత్వం జగనన్న పాలనలో ఈ నాలుగున్నర ఏళ్ళలో ఒక వార్డు లోనే సంక్షేమం అభివృద్ధి క్రింద 150 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది అని,మాటలతో కోటలు కట్టడం జగనన్న రాదు చేతలతో చేసి చూపించడమే ఆయనకు తెలిసిన పాలన ఆయన తోడ్పాటుతో భీమిలి ని గతంలో కంటే ఇప్పుడు నేను యంయల్ఏ గా చాలా అభివృద్ధి పథంలో నడపడం జరిగింది అని,రాబోవు ఎన్నికల్లో భీమిలి ప్రజలు దీవెనలతో ముచ్చటగా మూడోసారి గెలిసి భీమిలి ని మరింత అభివృద్ధి లో నడుపుతానని అడిగిన వెంటనే కాపు సామాజిక భవనం నిర్మాణం కి అర ఎకరం స్థలం కెటాయించిన ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడారు. కార్యక్రమం ను ఉద్దేశించి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ఎప్పుడూ ప్రజాహతమే అని,ఆయన పాలనలో ఎలాంటి వివక్ష గాని – ఏక పక్షం గాని-ఉండదని అన్ని వర్గాల వారి ఆర్థిక అభ్యున్నతి ఆయన పాలన లక్ష్యం అని,నా యస్సి నా యస్టి నా బిసి నా మైనారిటీ అంటూ వారికి అన్నింటా పెద్దపీట వేసారని,బిసి అంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అనే నినాదంతో విశాఖ జిల్లా పరంగా చూసుకుంటే యాదవ్ లకు ఒక సామాజిక భవనం నిర్మాణం కై ఈరోజు కాపులకు ఓ సామాజిక భవనం నిర్మాణం కై శ్రీకారం చుట్టారని,అలాగే కాపులకు పదవుల్లో పెద్దపీట వేయడం కాక కాపునేస్తం పథకం కూడా ప్రవేశ పెట్టి కాపుల్లో పేద మధ్యతరగతి వారికి చేయూత అందించారని,బుడుగు బలహీనుల వర్గాల వారి కోసం పాటు పడిన కాపు మహానాయకుడు అయిన వంగవీటి రంగా లాంటి నాయకుడు మనలో ఒకరై ఉండటం మనమంతా గర్వించదగ్గ విషయం అని,ఆయన తరువాత కాపులు కోసం నిలబడిన ముద్రగడ్డ పద్మనాభం లాంటి నాయకుడు ని ఆయన కుటుంబం ని వేదించి ఎన్నో అవమానాలు గురి చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడైతే కాపులకు కాపు కాసే కాపునేనవుతా అని నిలబడిన గొప్ప నాయకుడు జగనన్న అని, కాపు సామాజిక భవనం నిర్మాణం చేపట్టడం అది నా చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని మనమంతా ఒకటే కుటుంబం లా కలిసి మెలిసి రాబోయే ఎన్నికల్లో జగనన్న ను ముఖ్యమంత్రిని చేయడం కోసం పాటు పడాలని పిలుపునిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ – జీవియంసి మేయర్ గొలగాని హరి కుమారి – విశాఖ పార్లమెంటు సభ్యులు యంవివి సత్యనారాయణ – నార్త్ సమన్వయ కర్త కేకే రాజు – బొత్స ఝాన్సీ – ఉమ్మడి విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు గారు – కాపు నేతలు పాల్గొన్నారు.
