Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుకానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు

కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు

అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుండుపల్లి సరిహద్దులో ఉన్న గొల్లపల్లి చెరువు వద్ద కాపుకాశారు. ఈ సమయంలో ఎర్రచందనం తరలిస్తున్న వాహనం ఆ మార్గంలో వచ్చింది. వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేశ్ ప్రయత్నించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు ఆయనను వాహనంతో ఢీకొట్టి, పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ గణేశ్ ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి వాహనంతో పాటు, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article