Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుకాకినాడలో యువ వైద్యుడి ఆత్మహత్యకు జగన్ రెడ్డిదే బాధ్యత

కాకినాడలో యువ వైద్యుడి ఆత్మహత్యకు జగన్ రెడ్డిదే బాధ్యత

వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలి?
• వైద్యుడి తల్లికి వైసీపీ గూండాల బెదిరింపులు దుర్మార్గం
-కె. అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
రాజన్య రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నట్టు గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడలో యువ వైద్యుడు ఆత్మహత్యపై ఏం సమాధానం చెప్తారు? డాక్టర్ శివ కిరణ్ చౌదరి ఆత్మహత్యకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే బాధ్యత. భూ కబ్జాలు చేయడం, దోచుకుని దాచుకోవడంలో జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. శివ కిరణ్ నుంచి భూమి కొనుగోలు చేసిన మాజీ మంత్రి కన్నబాబు సోదరుడు కల్యాణ్ కృష్ణ, అనుచరుడు పెదబాబు, పీఏ బాలాజీ సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించలేదు. డబ్బులు ఇవ్వండి లేక దస్తావేజులులైనా తిరిగి ఇమ్మని ప్రాధేయపడిన వైడ్యుడిపై అధికారమదంతో బెదిరింపులకు పాల్పడటం జగన్ రెడ్డి నియంతపాలనలోనే సాధ్యమవుతోంది. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక కిరణ్ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై ఫిర్యాదు చేసిన శివ కిరణ్ తల్లిపై వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గం. వైసీపీ నేతల భూ దాహానికి ఇంకెంతమంది బలికావాలి? జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి , మాజీ మంత్రి కన్నబాబు స్పందించాలి. భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిగించాలి. కన్నబాబు సోదరుడు, అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article