ఇద్దరు వ్యక్తులు అరెస్టు.
192 కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం:లేపాక్షి ఎస్సై గోపి.
లేపాక్షి: ఆంధ్ర ,కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం రాత్రి లేపాక్షి ఎస్సై గోపి ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 192 కర్ణాటక మద్యం పాకెట్ల తో పాటు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. లేపాక్షి గోపి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమందేపల్లి మండల పరిధిలోని తుంగొడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై 192 మద్యం పాకెట్లను తీసుకువస్తుండగా వారిని అరెస్టు చేయడంతో పాటు మద్యం పాకెట్లను స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపడం జరిగిందన్నారు. అదేవిధంగా గురువారం ఉదయం లేపాక్షి పోలీసులు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించిన సంఘటనలో చలివెందల గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల నుండి 36 బాటిళ్ల ను స్వాధీనపరచుకున్నామన్నారు. అదేవిధంగా బసవనపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి నుండి ఏడు బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గురువారం తెల్లవారుజామున కర్ణాటక సరిహద్దు గ్రామాలైన సిరివరం, మానేపల్లి ,పులమతి గ్రామాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో అక్కడ దాడులు నిర్వహించడం జరిగిందని, అక్కడ ఎవరు దొరకలేదన్నారు. ఈ సందర్భంగా ఎస్సై గోపి మాట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వెంటనే 100 కు సమాచారమందించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గోపి తో పాటు కానిస్టేబుళ్లు షేక్షావలి, జనార్ధన్ తదితరులు ఉన్నారు.