వేంపల్లె
భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదిల్లో ప్రోద్దుటూరులో జరిగే కడప జిల్లా 5వ మహాసభలను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి చల్లా బాలాజీ, ఉపాధ్యక్షుడు దస్తగిరిలు కోరారు. ఆదివారం వేంపల్లెలో మహసభలకు చెందిన కరపత్రాలను భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం 1996లో స్థాపించడం జరిగిందని చెప్పారు. సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన క్లయిమ్స్ అన్నిటిని అపేయడం చాల దారుణమని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ ఫలాలు అన్నిటిని సంక్షేమ ద్వారానే అందించాలి. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 7 లక్షల పరిహారం చెల్లించాలి. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్లు సౌకర్యం కల్పించాలి.
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు వెంటనే పునరుద్ధరించాలి. బోర్డు కార్యకలాపాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు రమేష్ బాబు, బత్తల చలపతి, చిన్న టోపి, సిద్దయ్య, బాష, సుబ్బయ్య పాల్గొన్నారు.