కడప సిటీ
కడప జిల్లాలోఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా రామావత్ జగన్ రాథోడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర కోశాధికారి డాక్టర్ శివా నాయక్ మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీ ఆదివారం కదిరి నగరంలో జిల్లా పరిషత్ స్కూల్ కాంపౌండ్ లో లక్ష మందితో బంజారాల గర్జన సభను కడప జిల్లా అన్ని తాండాలల నుంచి బంజారాలు పాల్గొని జయప్రదం చేయాలనీ, అదేవిదంగా మన బంజారాల సమస్యల పైన రాజకీయ, వైద్యం, విద్య, ప్రజా సమస్యలు, ఉద్యోగుల సమస్యల పైన ప్రభుత్వం కి వివరణ ఇవ్వాలని,వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య బంజారాలు పాల్గొని జయప్రదం చేయాలనీ కోరారు, రాష్ట్రంలో బంజారాలు అన్ని విధాలా ఎదగాలానే ఆలోచనతో తలపెట్టినఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా మాజీ అధ్యక్షులు వెంకట స్వామి నాయక్, జిల్లా యువజన నాయకులు కృష్ణ నాయక్, బీడీ నాయక్, గోపి నాయక్, రాజా నాయక్, విష్ణు నాయక్, తదితరులు పాల్గొన్నారు