గాండ్లపెంట:కదిరి నియోజవర్గం కూటమి అభ్యర్థి అయిన కందికుంట వెంకటప్రసాద్ ను సోమవారం జరిగే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మండల తెదేపా నాయకులు మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థులను కోరారు. మండలంలోని గాండ్లపెంట జీనులకుంట మలమీద పల్లి కటారుపల్లి గొడ్డు వెలగల గురుమామిడి చామలగోంది తు పల్లి సోమయాజులపల్లి తదితర గ్రామాలలో అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కొండయ్య, మాజీ సింగల్ విండో అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, జిల్లా కిసాన్ మోక్ష అధ్యక్షుడు కేశవరెడ్డి ,సీనియర్ నాయకుడు దొనకొండ ఆనంద్ ,మాజీ ఎంపీపీ గంగరాజు, మైనార్టీ నాయకుడు అక్రమ్, ఆంజనేయులు నాయక్ ,పవన్, అంజి, టిడిపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
