Wednesday, May 7, 2025

Creating liberating content

తాజా వార్తలుకంటైనర్లలో రక్షణ సామాగ్రి

కంటైనర్లలో రక్షణ సామాగ్రి

వేల కోట్ల తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం

ప్రచారంచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరిక

కడప బ్యూరో

దేశ రక్షణ శాఖకు సంబందించిన సామాగ్రిని చెన్నై కి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీ కి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్ గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియా లో దుష్ప్రచారం తగదని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ పేర్కొన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్ తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article