ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సేవ చేస్తామని చెప్పుకుంటూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వీరిని ఈ ప్రజాస్వామ్య ద్రోహులు అనాలా లేక ప్రజాప్రతినిధుల ముసుగులో ఉన్న ప్రజా కక్షకులు అనాలా..ఏమి అనాలి ..ఇంకేమి అనాలి వీరిని…ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో మరెన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజా రంజక పాలన ఇస్తుంటే.. మాట తప్పని మడమ తిప్పని నేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిధిగా సాగుతుంటే…చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందంగా ఆయన అమూల్యమైన సందేశాన్ని అటకపైకి ఎక్కించి అడ్డగోలుగా దోచుకుంటూ అక్రమ దారుల వద్ద వీరే లక్షలు పుచ్చుకుంటూ,అక్రమార్కుల కు అభయమిస్తూ ఓ వైపు ప్రజాధనాన్ని కొల్లగొడుతూ మరో వైపు కార్పొరేషన్ కు గండి కొట్టిస్తూ.. సామాన్య ప్రజలపై గావు కేకలు వేస్తూ గంభీరాన్ని ప్రదర్శిస్తూ పబ్బం గడుపుతున్న ఈ నేతలను ఏమి అనాలి ఇంకెమని ప్రశ్నించాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడటం ఎంతటి దౌర్భాగ్యమో ఓ సారి ఆలో చించాలి మరి.పేద బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉండాల్సిన వీరే బలిసిన వారికి అండగా నిలుస్తూ ప్రశ్నించిన వారిపై వీరి జులుం ప్రదర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్న వీరికి రేపటి దినం గడ్డుపరిస్థితి రాక పోదా అన్న ప్రజావాణి విన పడుతోంది…ఇదంతా బెజవాడ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకోవడం బెజవాడ వాసులు చేసుకున్న పాపం గా చెప్పుకోక తప్పడం లేదు..