Sunday, September 7, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఓ బడ్డి కొట్టు…ఓ కారు…ఓ ప్రేమ కథ…

ఓ బడ్డి కొట్టు…ఓ కారు…ఓ ప్రేమ కథ…

*ఏలూరు రోడ్ టూ తక్కెళ్ల పూడి వయా గుంటూరు
*కాకి బంగారం.. కాకి నలుపుతో కబుర్లు…
*ఈ ఇద్దరి కబుర్లే కంపు కంపు… అందరిని కంపు కంపు అంటుంటే…
*వీరి కాపురాలే వీధిలో ఉన్నా…అందరిని వీధిన పడేస్తుంటే…
*వీరే గానకోకిలలు..మిగిలిన వారంతా ….?
*పైన చెల్లి.. లోన చెలి…అందుకు అందరిని లొల్లి చేస్తుంటే…
*కారు ప్రయాణం కొందరికి కొన్ని రోజులే… ఈ కాకి ప్రయాణం ఇంకెన్ని రోజులో మరి…
*బజారు బడ్డి కొట్టు బ్రతకు ఓ నటన…
*అందుకే అందరి బ్రతుకులు రోడ్డుకు లాగాలని ఆరాట పడుతుంటే…
*ఆ రవి హస్త మించిన ఈ రవి ప్రకాశిస్తూనే ఉంటాడట..
*పట్టు చీరకు ఇంకెన్ని పాడు పనులు చేస్తారో నని…
*వీరు ఇల్లు చూస్తే చస్తారు… అందరి ఇల్లపై అబద్ధపు కూతలు కూస్తుంటే…
*మాంత్రికుడు మామిడి కాయల రహస్యం మొత్తం బట్టబయలు అయితే…
*బజారు బడ్డి కొట్టు బాగోతం బైటకి వస్తే…
*కాకి బంగారం కోసం పెద కాకానిలో పెద్ద హంగామా చేసినా…
*కాకి బంగారం కోసం గావు కేకలు వేస్తుంటే…
*అమ్మవారి పీఠం లో కనపడక పోయే అసలు రంగు..
*కారులో షికారు కోసం…కూస్తున్న కారు కూతలు వింటే…
*కాసులివ్వలేదని కాకి బంగారం కథ బైటకి రాబోతుంటే…
*ఈ రంగురాళ్ల జీవితానికి ఇంకెన్ని రోజులో మరి…
*ఆ రంగులు..ఈ చెంగుల వెనుక ఉన్న చిల్లర కథలు ఒక్కొక్కటిగా బైటికి వస్తే…
*ఊరంతా ఒకదారి అయితే ఉ..పాడు దారి ఇంకొకటి అయితే….
*వీడి ముసుగు తీస్తే అంతా మోసం…
*అందరిని ముసుగేసి కొట్టాలని కారు కూతలు కూస్తుంటే…
*బెజ్జన్న పేట గ్యాంగ్ తో బడ్డి కొట్టుకు బోలెడు లింకులున్నా యంటుంటే…
*వీడి కుటుంబ కథా చిత్రమంతా విచిత్రం…
*అందరి కుటుంబాల్లో విచిత్రాలు ఉన్నాయని వెర్రి కూతలు కూస్తుంటే…
*బడ్డి కొట్టు మాటున సాగుతున్న రహస్యమేమిటో..
*కారు.. కాకి బంగారం కథ వెనుక ఉన్న అసలు కథ ఏమిటీ…
(ప్రజాభూమి ప్రత్యేకం)
అనగనగా ఒక పట్టణము ఉంది.ఆ పట్టణము అన్ని కళలకు నిలయమైనది. దశాబ్దాలుగా మంచి ఉత్సహాన్ని ఉల్లాసాన్ని పంచె కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటే ఎంతో మంది ఔత్సాహికులు కూడా పాల్గొని ఆనందాన్ని పంచుకొంటూ జీవించేవారు.అలాంటి రంగుల ప్రపంచంలో కి ఒక రంగురాళ్ల వాడు అరేంగేట్రం చేసాడు.వీడి రూపం ఒకటి రూపాలు అనేకం. అసలు రూపం తెలిస్తే వీడిని అడ్రెస్ లేకుండా చేస్తారు అందుకు సంబంధించిన వారు.ఇలానే ఆ కలకు ఏలాంటి సంబందం లేని కళంకితురాలు అడుగు పెట్టి తన అనన్య సామాన్యమైన ప్రతిభ ఉందని మిడిసి పడుతూ లేనిరూపాన్ని ఉందని చూపించాలని ఆరాటపడుతు ,అసూయ ద్వేసం తో అనునిత్యం అందరి కొంపల్లో జరిగే వాటిని ఆసక్తిగా తెలుసు కుంటూ అవన్ని అడిగిన వారికి అడగని వారికి అదే పనిగా చెబుతూ అబద్ధపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
ఇక్కడ ఈ రంగురాళ్ల వాడికి ఊసరవెల్లి లాగా రూపాలు మార్చే అలవాటు బాగా ఉంది. పొట్టకూటి కోసం పగటి వేషగాడు లాగా వేషం అందుకు తగ్గట్టుగా వేషాలు వేస్తూ వెర్రి కూతలు కూస్తూ కాకి బంగారం చూపిస్తూ కావ్ కావ్ మంటూ గావు కేకలు వేస్తూ జీవిస్తూ ఉంటాడు.
అయితే ఈ రంగురాల్లోడి రంగులు చూసి మోసపోయిన వారు ఉన్నారు. .ఈ రంగు రాల్లోడికే రంగులు చూపించిన మేధావులు కూడా ఉన్నారు.ఇలా జరుగుతున్న నేపధ్యంలో తానే స్వరాలు పలికిస్తానని తన స్వరాలు వింటే నరాలు కూడా ఉబ్బి పోతాయని ఒకడు ఏ నరాలు ఎక్కడ ఉబి పోతాయో వాడికే తెలియాలి అలాంటి వాడి దగ్గర అన్ని కలలు సాధన చేసింది ఓ.బడ్డీకొట్టు.
బ్రతుకు దేరువు కోసం బడ్డి కొట్టు తప్పేమీ కాక పోయిన ఆ బడ్డి కొట్టు ముసుగులో అందరి బ్రతుకులు ఛిద్రం చేసేలా చేసే బజారు పనులే ఈ బాగోతం బజారున పడేస్తున్నాయి.ప్రారంభంలో బడ్డి బ్రతుకు బాగా ఉందని భ్రమ పడ్డారు అందరూ.కానీ ఒకడి కోసం ఇద్దరూ పోటీ పడటం తో బోలెడు వ్యవహారాలు బైటికి రావడం జరిగింది.ఓ అజ్ఞాత వాసి అనుకోకుండా అడుగుపెట్టి అతని అనన్య మైన పాండిత్యాన్ని ప్రదర్శించి ఎందరినో ఏదో చేయబోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఇక్కడ మొదలైన బడ్డి కొట్టు వ్యవహారం చెల్లి ముసుగులో నుంచి చెలిగా బైట పడకుండా మరో చెలి తో వ్యవహారం చెడి చివరికి ఏ కారు ఏ రంగురాళ్ల గురించి అవహేళన చేసిందో ఆ రంగురాళ్ల కు ఆ కారుకు కేరాఫ్ అడ్రస్ బడ్డి కొట్టే కీలకమైనది.
ఇక ఆ కారు ఈ బడ్డి కొట్టు ఒక్కటయ్యారు అందరి గురించి కారుకూతలు కూయడం మొదలు పెట్టారు.అసలు ఎందుకు ఈ కారు కూతలు వస్తున్నాయంటే అసలు ఆ కలకు సంబంధం లేని దండుపాలెం బ్యాచ్ ఒకటి అక్కడ తిష్ట వేసి అందరి జీవితాల్లో తొంగి చూస్తూ అభాశుపాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీనితో రంగురాల్లోడికి రూపాలు మార్చేందుకు చాలా సులువుగా పరిస్థితి ఏర్పడింది.
ఇలా బడ్డి కొట్టు అందరి వివరాలు సేకరించడం రంగు రాల్లోడికి మోయడం వాడు ఏ ఇంటిలో రంగు రుచి చిక్కదనం ఉందొ లేదో తెలుసుకోవడం పరిపాటిగా మారింది.అలా తెలుసు కుని లేని రూపాయి ఉన్నట్లు చూపిస్తూ వాడొక అపర బ్రహ్మ లాగా అవతారం చూపిస్తూ అందరి కొంపల్లో నిప్పులు పోయడం అలవాటుగా పెట్టుకుని అందుకు ఆ బడ్డి కొట్టు ను ప్రధాన కేంద్రం గా చేసుకోవడం జరిగింది. ఈ బడ్డి కొట్టు కారు నున్న జంగారెడ్డిగూడెం గుంటూరు ఇలా షికార్లు చేస్తూ ఆ షికార్లు బైటికి రాకుండా పుకార్లు పుట్టిస్తూ ఉండగా ఈ రంగురాల్లోడి జీవితంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది.కాకిబంగారం చూపించి అసలు బంగారం లాగా బిల్డప్ ఇవ్వగా అది కాస్తా కాకిబంగారం అని పేదకాకాని లో బట్టబయలైంది.
అసలు ఆ కాకిబంగారం పెదకాకాని కి చేరిందంటే ఈ రంగురాళ్ల వెనుక ఉన్న కోట్లన్ని వేసుకునేవే తప్ప కాగితాలు కాదు.అలా వీడి బ్రతుకు రోడ్డున పడే స్థాయిలో ఓ చోట కాకిబంగారం తాకట్టు పెట్టాడు.ఆ కొట్టువాడు ఈ బడ్డి కొట్టు దానికంటే బలే కిలాడీ గాడు. ఈ కాకిబంగారం కాకిలా ఎత్తుకెళ్ళి ఎక్కడో దాక్కున్నాడు.దీంతో గిల గిల కొట్టుకుంటూ రంగు రాల్లోడు ఒకచోటికి చేరుకుని జరిగిన కథ బైట పెట్టాడు. సరే పాపం అని సహాయం చేయబోతే వీడి నీచ బుద్ది బైట పెట్టి తప్పుడు కూతలు ఎక్కడ కూయకూడదో అక్కడే కూశాడు అవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాయి.దీంతో అన్ని ఆరా తీయగా రంగురాళ్ల జీవితం మొత్తం బట్టబయలైంది. అసలు మామిడి తోట వెనుక ఉన్న ఇంటి కథేమిటీ,ఆ ఇంటిలో మామిడి కాయలు మాటున ఈ రంగురాల్లోడు చేసేదేమిటి,దేనికోసం పట్టుచీరలిచ్చి బడ్డి కొట్టును అలంకరించాడు…ఆ బడ్డి కొట్టే ఈ రంగురాల్లోడికో ఎందుకు దిక్కయ్యింది…ఈ రెండు ఇల్లు ఎంతో మురికిగా ఉంటే అందరిపై మురికి ముష్ఠి కూతలు ఎందుకు కూస్తున్నారు అన్న లోగుట్టు పెరుమాళ్ల కెరుక రీతిన అన్ని ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి.ఇంకా బోలెడు విషయాలు వచ్చే సంచికలో చదవండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article