ఏలేశ్వరం:-రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రత్తిపాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర బలగాలతో పోలీస్ కవాతు ను ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు ఎస్సై జి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించినడే సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఎస్సై జి సతీష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయినట్లయితే వారు బ్రతికున్నంత కాలం ఆ కేసులు వారిని వెంటాడుతూనే ఉంటాయన్నారు.
ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో ఎస్పీ ఎస్.సతీష్ కుమార్,పెద్దాపురం డిఎస్పి కె.లతాకుమారి ఆదేశాలతో ప్రత్తిపాడు సీఐ ఎం.శేఖర్ బాబు,ఏలేశ్వరం ఎస్సై జి.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు,ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకుగాను కేంద్ర పోలీస్ దళాలు,సివిల్ పోలీసులు సంయుక్తంగా ఏలేశ్వరం టౌన్లో లింగంపర్తి, తిరుమాలి,పెద్దనాపల్లి గ్రామాల్లో కవాతు నిర్వహించారు.
ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కేంద్ర పోలీస్ బలగాలు భద్రత,భరోసా ఉంటుందని తెలియజేసేందుకు ఈ సంయుక్త కవాతు నిర్వహించడం జరిగిందన్నారు.ఎన్నికలను ప్రశాంత యుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని,ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు.