విక్టరీ వెంకటేష్ చేసిన తాజా సినిమా ‘సైంధవ్’ . ఈ సినిమాలో చాలాకాలం తర్వాత ఊర మాస్ లుక్ లో కనిపించి అలరించారు వెంకీ. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అప్పటికే ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’ సినిమాలు విడుదలై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్నా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది ‘సైంధవ్’. ‘హిట్ 2’ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్, టీజర్ తోనే ఈ మూవీపై ఆసక్తిని కలిగించారు. అలాగే ఈ మూవీలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కంటెంట్ బలంగా ఉన్న సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడడంతో అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ డ్రామగా క్లిక్ అయ్యింది. ఇక విడుదలై నెలరోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది ‘సైంధవ్’.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.