తమిళ నటడు మణికందన్ నటించిన లేటెస్ట్ సినిమా ట్రూ లవర్. ఈ మూవీలో గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మూవీస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు మారుతి, నిర్మాత కలసి తెలుగు ప్రేక్షకుల ముందుకు ట్రూ లవర్ రానుంది. తమిళంలో సూపర్ హిట్ అయన ఈ సినిమాను ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. ఇక మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. ఫిబ్రవరి 10న థియేటర్స్‌లో విడుదలైంది. అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాను మార్చి మొదటివారంలో స్ట్రీమింగ్ కానుంది.