గాజువాక : కోరమాండల్ గేట్ కి చెందిన ఒక వ్యక్తి ప్రజలకు ఒక మంచి సమాచారం ఇచ్చారు…అతని పేరు రాల పేట కృష్ణ ఓటు మన హక్కు డబ్బులకి కానీ, మద్యం కి కానీ, చీరలకు కానీ ఆసపడి ఓటును అమ్ముకోకండి అనే బోర్డును బండి కి పెట్టుకున్నారు. ఆ సమాచారం మొదలు పెట్టి ఈరోజుకి 75రోజులు అని అన్నారు. నేను ఓటు వేసే వరుకు ఆ బోర్డ్ ని తీయను అని చెప్పారు. ప్రజలు ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోవాలి అని… మంచి మార్గంలో నడిపించే నాయకుడిని గెలిపించాలని తన కోరిక అన్నారు.