నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దీపికా వేణు బిసల మానేపల్లి లో వైకాపా ప్రచారం
లేపాక్షి: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఒక్క అవకాశం ఇస్తే హిందూపురం నియోజకవర్గ రూపురేఖలను మార్చి వేస్తానని హిందూపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపికా వేణు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని బిసల మానేపల్లి, రాజీవ్ కాలనీ ,వెంకటాపురం గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేశారు. దీపికా వేణు మాట్లాడుతూ, తాను స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానన్నారు. మీ ఇంటి బిడ్డగా ఓట్లు అడిగేందుకు మీ ముందుకు వచ్చానని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా ఉండి చేసిన అభివృద్ధి చూపించాలని దీపిక పేర్కొన్నారు. నేను మీ మధ్యనే ఉంటానని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, నిరంతరం మీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఒక్కసారి తనకు శాసనసభ్యులుగా అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలయ్యాయన్నారు. మరొక్కసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని దీపికా వేణు ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు వేణు రెడ్డి ,మధుమతి రెడ్డి, కన్వీనర్ నారాయణస్వామి, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ హనోక్, సర్పంచులు ఆదినారాయణ, మంజునాథ్, అశ్వర్థ నారాయణ ,వైస్ ఎంపీపీ లీలావతి ,నాయకులు వేణుగోపాలరెడ్డి, శంకరప్ప, చలపతి, కల్లూరు ప్రభాకర్, ప్రసాద్ ,చంద్ర ప్రసాద్ లతోపాటు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.