Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుఐదో విడతలో పోటీ పడనున్న 695 మంది అభ్యర్థులు

ఐదో విడతలో పోటీ పడనున్న 695 మంది అభ్యర్థులు

6 రాష్ట్రాలు, 2 కేంద్ర పరిపాలిత ప్రాంతంలోని 49 పీసీ స్థానాల్లో జరగనున్న ఎన్నికలు

అమరావతి: 2024 సాధారణ ఎన్నికలు – ఐదవ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతములోని మొత్తం 49 లోక్ సభ స్థానాలకు మొత్తం 695 అభ్యర్థులు పోటీ పడనున్నారు. సగటున ఒక్కో పార్లమెంటరీ స్థానానికి 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మరియు జమ్మూ&కాశ్మీర్, లడఖ్ కేంద్ర పరిపాలిత ప్రాంతంల్లోని 49 స్థానాలకు మొత్తం 1,586 మంది నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 749 నామినేషన్లు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. ఉపసంహరణ అనంతరం 695 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం జరిగింది.

ఐదవ విడతలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 13 పార్లమెంటరీ స్థానాలలో 264 మంది అభ్యర్థులు, ఉత్తర ప్రదేశ్ నుంచి 14 స్థానాలలో 144 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు.

ఈ ఐదో విడతలో మహారాష్ట్రలోని 13 పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా 512 నామినేషన్లు దాఖలుగా తదుపరి వరుసగా ఉత్తరప్రదేశ్ లోని 14 పీసీ స్థానాలకు 466 నామినేషన్లు, జార్ఖండ్ లోని చాత్ర పీసీ స్థానానికి 69 నామినేషన్లు మరియు ఉత్తరప్రదేశ్ లోని లక్నో పీసీ స్థానానికి 67 నామినేషన్లు దాఖలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article