Thursday, May 8, 2025

Creating liberating content

తాజా వార్తలుఐతేపల్లిలో తెలుగు యువత తో పులివర్తి నానిఆత్మీయ సమావేశం..!

ఐతేపల్లిలో తెలుగు యువత తో పులివర్తి నానిఆత్మీయ సమావేశం..!

చంద్రగిరి:నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరి మండలంలో ఐతే పల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ యువతతో పులివర్తినాని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:యువతను మోసం చేసే పార్టీలు, వ్యక్తులు బాగుపడింది లేదని,అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ ఇస్తామని వైసిపి మోసం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రేణిగుంట, శ్రీసిటీ లో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
పరిశ్రమలు రాక, ప్రోత్సాహకాలు అందక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్న యువత ఆదుకునేందుకునియోజకవర్గంలో ఉన్న ప్రతి 10 మందిలో 6 నుంచి 7 మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తా మన్నారు.
అమెరికాలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. అలాగే గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉక్కుపాదం మోపుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లి లేని సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు రమేష్ రెడ్డి, గౌస్ భాష, ఏ.వి. రమణ మూర్తి, సురేష్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ప్రవీణ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article