తుని
మూడు రోజులపాటు వైభవోపేతంగా జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొండంగి మండలం ఏవి నగరంలో ముగిసాయి. గ్రామంలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏడవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భీష్మ ఏకాదశి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉత్సవాలు ముగింపు సందర్భంగా స్వామి అమ్మవార్లను గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకొని వెళ్లారు. అక్కడ వేద పండితులు పూజలు నిర్వహించి శ్రీ చక్ర స్నానం గావించారు. అనంతరం ఆలయంలో ఉత్సవమూర్తులను ప్రతిష్టించారు. యనమల నాగేశ్వరరావు, యనమల రామకృష్ణుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
