Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఏ.రంగంపేటలో భారీ మెజార్టీ ఇస్తాం !! టీడీపీ గెలుపుకు ఖాయమంటున్న గ్రామస్తులు..

ఏ.రంగంపేటలో భారీ మెజార్టీ ఇస్తాం !! టీడీపీ గెలుపుకు ఖాయమంటున్న గ్రామస్తులు..

చంద్రగిరి:చంద్రగిరి మండలం, ఏ.రంగంపేట పంచాయితీ ప్రజల ఆదరాభిమానాలు వెలకట్టలేనిదని, ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపడమే కాకుండా భారీ మెజార్టీ ఇస్తామంటున్నారని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అన్నారు. సోమవారం “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” “బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఏ.రంగంపేట పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, జపసేన, బిజెపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి వినీల్ ఇంటింటికీ తిరుగుతూ మినీ మేనిఫెస్టో లోని అంశాలపై అవగాహన కల్పించారు. సూపర్ సిక్స్ పథకాలను గురించి వివరించారు. ఓటమికి కృంగి పోకుండా గడిచిన 5 ఏళ్లుగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పులివర్తి నాని గెలుపు ఖాయమని ఏ.రంగంపేట గ్రామస్తులు అన్నారు. పంచాయితీలో ఈ 5ఏళ్లలో పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెరుగుదల, కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు మోత.. చెత్త పన్ను వంటి వాటితో నిరుపేద, మధ్యతరగతి వర్గాలు నలిగిపోతున్నాయని పులివర్తి వినీల్ అన్నారు. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అలాగే చంద్రగిరిలో నా తండ్రి పులివర్తి నాని ని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article