కళామతల్లి పేరుతో కాసులు నొక్కేస్తున్నారా
అసలు వీరు కళాకారులు కాదా
విరాళాల కోసమే సన్మానాల…సన్మాలకోసమే విరాళాల…
దొంగ డాక్టరేట్లతో కలలను హేళన చేస్తున్నారా
5వేలకే డాక్టరేట్ ఇస్తున్నారా…
ఏ1,ఏ2,ఏ3 లు అంటే ఎవరు?
కౌతాలమా మజాకనా…
ఈ కళారంగాన్ని బాగుచేసేదేవరు..
గగ్గోలు పెడుతున్న సాటీ కళారంగాల వారు..
రిజిస్ట్రేషన్ ఉంటేనే గుర్తింపు ఉన్నట్లా…
ముందే చెప్పిన ప్రజాభూమి…
నిజాలు జీర్ణించుకోలేక దాడులకు పాల్పడ్డ వైనం..
ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు…
ఖాకీ ఖాకీలు సర్దుబాటు చేసుకున్నట్లేనా…
నాటి కళాకారుడి ఆవేదన నిజమేగా..
ఇప్పుడేమి చెప్తారో ఈ పెద్దలు…
విజయవాడ:కల మనిషికి వరం. కళామతల్లి అనుగ్రహం అందరికి దక్కదు కొందరికే వరిస్తుంది.సంగీత స్వరాలు మనిషి ఆయస్సును పెంచుతాయి.బరువెక్కిన గుండెను కూడా సులువు చేస్తుంది. ఆ సంగీత స్వరాలు సగటుజీవి హృదయ సంపుటికలను తాకినప్పుడు కలిగే అనుభూతి వర్ణించడానికి వీలుకాదు. వెలకట్టలేనిది. కేవలం కలలను నమ్ముకుని అనాదిగా ఎన్నో కుటుంబాలు కోట్లు గడించాయి…మరెన్నో కుటుంబాలు తినడానికి తిండి కూడా లేకుండా ఆకలి చావులకు గురవుతున్న సంఘటనలు చూసాము… ఆ కళామతల్లి అనుగ్రహముతో కలిగిన కంఠం నుండీ జాలువారిన,జాలువారుతున్న మధుర ఘానాలు ఎంతో మధురానుభూతిని ఇస్తాయి… ఇది అనాదిగా వస్తున్న ఆచారం..వ్యవహారం…అయితే ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కల అనేది కమర్షియల్ అయిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకీర్మ..ఏమిటా దరిద్రం అన్న విషయాలు ఓ సారీ పరిశీలిస్తే… తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో కలలకుఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కలల కోసం ఎంతోమంది ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు.అనేకమంది కళాకారులు జీవిస్తున్నారు.ప్రాచీన ఆధునిక కలల మీద ఉన్న మక్కువతో ఇప్పటికే అనేక రంగాల్లో ఉన్నా కళారంగం మీద అభిమానంతో ముందుకు వస్తున్నారు.అదే ఇక్కడి కొంతమంది కళాకారుల ముసుగులో తమ పైశాచిక త్వాన్ని చూపించేందుకు గ్రూపులుగా తయారు అయి తమ వింత పోకడలు చేస్తూ పబ్బం గడుపుకుంటూ తమ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు.ఇందుకు తార్కాణంగా ,కుట్రలకు నిలయంగా కౌతాలం వేదిక కావడం కళామతల్లి చేసుకున్న దౌర్భాగ్యమా లేక కళామతల్లికి పట్టినా గ్రహణమా అన్న బాధలో ఉన్నారు పేద కళాకారులు. ఇక్కడ జరుగుతున్న అకృత్యాలు, ఘోరాలు చూసి న కొంతమంది కళాభిమానులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు.తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ముఠాలు, గ్రూప్ ల కోసం రాజకీయపార్టీల అజెండాను కూడా భుజానికెత్తుకొని కళామతల్లిని క్రుంగదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.అయితే ఇక్కడ ఏ1,ఏ2,ఏ3 లు ఉన్నారట..వారు చెప్పిందే వెదమట,వారు పాడింది పాటలట,వారు ఆడిందే నాట్యమట.అదేమీటీ అంటే అంటే తమవి రిజిస్టర్ సంస్థలని తమరు చేసిందే నాట్యమని చెలామణి చేయించుకుంటూ జీవిస్తూ కళామతల్లికి కన్నీరు కారిస్తున్నారన్నా అపవాదు ఇక్కడ ఇక్కడ మూటకట్టుకుంటున్నారు.తమకు వచ్చిన పాండిత్యాన్ని చూపిస్తూ ఇదే పాండిత్యాన్ని తమ గొప్ప ప్రతిభగా నకిలీ డాక్టరేట్ లు పొందారని వాటిని భుచిగా చూపించి తమ అంగ,ఆర్థిక బలం ప్రదర్శిస్తుంటే బరువెక్కిన హృదయం తో బాధను వెల్లుబుచ్చుతున్నారు బడుగు కళాకారులు. ఇలాంటి ఘోరమైన సంఘటనలు అనేకం జరుగుతున్నా ఓ పేద కళాకారుడు చూసి కూడా పట్టించుకోక పోయిన అతని మీద దాడి చేసి,ఆ దాడిని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని ఆ పేద కళాకారుడికి అన్యాయం చేసిన ఉదంతం కూడా ఉన్నాయి.సదరు పేద కళాకారుడు పోలీసులను ఆశ్రయించిన పోలీసులను కూడా తప్పుద్రోవ పట్టించి చివరికి అదే పోలీసులను దారి తప్పించి పేద కళాకారుడినే నిందితుడిగా మార్పించిన మహమేధావులు కూడా ఇదే కౌతాలం కుట్రలో ఉన్నారన్న విమర్శలు బోలెడు వినిపిస్తున్నాయి. అయితే ఈ కళారంగానికి పట్టిన గ్రహణం వీడేదెన్నడో అని పేద కళాకారులు ఆశతో ఎదురుచూస్తున్నారు.