ముదిగుబ్బ
సత్యసాయి జిల్లా ఏపీ వాల్మీకి బోయసంఘం జిల్లా అధ్యక్షుడిగా కనుమ ప్రభాకర్ ని ఎన్నుకున్నట్లు ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్రఅధ్యక్షుడి విక్రంనాయుడు ఒకప్రకటనలో తెలిపారు. ముదిగుబ్బకు చెందిన కనుమ ప్రభాకర్ వాల్మీకి బోయల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నాడని ప్రభాకర్ ను రాష్ట్ర సంఘం అభినందిస్తూ ఏకగ్రీవంగా ప్రకటించినట్లు వారు అందులో పేర్కొన్నారు. ఈసందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లాఅధ్యక్ష స్థానం కల్పించినందుకు విక్రమనాయుడు, సంఘం జనరల్ సెక్రెటరీ జక్కాల శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకి బోయల అభివృద్ధి, వాల్మీకి విద్యార్థుల అభ్యున్నతి, వాల్మీకి బోయలు రాజకీయంగా ఎదిగేందుకు తనవంతు మరింతగా కృషిచేస్తానని అన్నారు.