Saturday, September 13, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌కు పచ్చజెండా.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌కు పచ్చజెండా.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం ఇవాళ కీల‌క తీర్పును ఇచ్చింది. ఎస్సీ,ఎస్టీల వ‌ర్గీక‌ర‌ణ‌కు ఓకే చెప్పింది. ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఈ కీల‌క తీర్పును వెలువ‌రించింది. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌తో పాటు జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, విక్ర‌మ్ నాథ్‌, బేలా ఎం త్రివేది, పంక‌జ్ మిఠ‌ల్‌, మ‌నోజ్ మివ్రా, స‌తీష్ చంద్ర శ‌ర్మ ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్నారు. 2005లో ఇచ్చిన ఈవీ చెన్న‌య్య వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం కేసును కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 341కు వ్య‌తిరేకంగా వ‌ర్గీక‌ర‌ణ ఉన్న‌ట్లు ఆ నాటి తీర్పులో సుప్రీం తెలిపింది. అయితే ఇవాళ ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఆ తీర్పును తోసిపుచ్చింది.ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌ను జ‌స్టిస్ బేలా త్రివేది వ్య‌తిరేకించారు. ఉప వ‌ర్గీక‌ర‌ణ‌ను అనుమ‌తించ‌బోమ‌న్నారు. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణను అమ‌లు చేస్తున్న పంజాబ్‌, త‌మిళ‌నాడుతో పాటు ఇత‌ర రాష్ట్రాల చ‌ట్టాల‌ను కోర్టు స‌మ‌ర్ధించింది. 2006లో పంజాబ్ రూపొందించిన ఎస్సీ, బీసీ రిజ‌ర్వేష‌న్ చ‌ట్టాన్ని కూడా కోర్టు స‌మ‌ర్థించింది. రిజ‌ర్వేష‌న్ల‌లో ఉప వ‌ర్గీక‌ర‌ణ‌కు పంజాబ్ చ‌ట్టం చేసింది. కానీ దాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు అడ్డుకున్న‌ది. దీంతో పంజాబ్ స‌ర్కారు సుప్రీంను ఆశ్ర‌యించింది. అణ‌గారిన కులాలకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డాన్ని కేంద్ర స‌ర్కారు స‌మ‌ర్థించుకున్న‌ది. ఉప వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా ఉన్న‌ట్లు కోర్టుకు ప్ర‌భుత్వం చెప్పింది.కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా, అడ్వ‌కేట్ క‌న్ను అగ‌ర్వాల్ వాదించారు. పంజాబ్ రాష్ట్రం త‌ర‌పున అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గుర్మింద‌ర్ సింగ్‌, అడిష‌న‌ల్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ షాదాన్ ఫ‌రాస‌త్‌, అడ్వ‌కేట్ న‌టాషా మ‌హేశ్వ‌రి వాదించారు. సీనియ‌ర్ అడ్వ‌కేట్ శేఖ‌ర్ న‌పేడా, పూర్నిమా కృష్ణ‌, ఎంఎఫ్ ఫిలిప్‌.. త‌మిళ‌నాడు త‌ర‌పున వాద‌న‌లు వినిపించారు. హ‌ర్యానా త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాదిఅరుణ్ భ‌ర‌ద్వాజ్ కోర్టుకు హాజ‌ర‌య్యారు.సీనియ‌ర్ అడ్వ‌కేట్లు గోపాల శంక‌ర‌నారాయ‌ణ‌, నిదేశ్ గుప్తా, క‌పిల్ సిబ‌ల్‌, సంజ‌య్ హెగ్డే, శేఖ‌ర్ ప‌డాడే, స‌ల్మాన్ ఖుర్షీద్‌, విజ‌య్ హ‌న్సారియ, దామా షేషాద్రి నాయుడు.. ఉప వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా వాదించారు. సీనియ‌ర్ అడ్వ‌కేట్ మ‌నోజ్ స్వ‌రూప్‌, అడ్వ‌కేట్ సాకేత్ సింగ్‌.. ప్ర‌తివాదుల త‌ర‌పున హాజ‌రై.. ఉప వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వాదించారు.మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మ‌తి త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ కేకే వేణుగోపాల్ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా వాదించారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్ధ లూత్రా హాజ‌ర‌య్యారు. ఏపీ స‌ర్కారు త‌ర‌పున డాక్ట‌ర్ ఎస్ ముర‌ళీధ‌ర్ వాదించారు. కార్య‌క‌ర్త జీఎం గిరి త‌ర‌పున అడ్వ‌కేట్ శివం సింగ్ వాదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article