*బియ్యం మాఫీయా గాళ్లతో లింకేంటి…
*బద్రీ తో బందుత్వమా…బేరాలున్నాయా..?
*అర్ధరాత్రి అక్కడ రచ్చ దేనికోసం…
*ఆ మాఫీయా వాళ్ళ కోసం బెదిరింపులెందుకో…
*బద్రీనాదే ఉన్నాడా…ఆ పేరును బధనాం చేస్తున్నారా…
*పామర్రు టు సింగ్ నగర్ కథేమిటీ…
*తిరువూరు టు తాడిగడప వ్యవహారమేమిటో…
*రాణిగారి తోట…పటమటలో మాఫీయా లీల లేల…
*మాఫీయా గుట్టు విప్పితే మనుష్యులనే లేపేస్తారా…
*రేషన్ మాఫీయా చేస్తూ సుఫారీ ల బేరాలు కూడా చేస్తారా..
*బుడమేరు వరదల్లో బ్లాక్ మెయిల్ చేసిందెవరు…
*అడిగిందే…చెప్పిందే వినాలని హుకుం జారీ చేసిందెవరు…
*మాట వినకపోతే ఏదయినా చేస్తారా…
*ఆ ఇద్దరే అప్పుడు..ఇప్పుడు శాశిస్తారా…
*బాపట్లలో 40 లక్షల మాటమిటో..
*రేషన్ బియ్యం మాఫీయా ఇంతలా ఉందా…
*విజిలెన్స్ కూడా ఉకొట్టాల్సిందేనా…
*కులం కార్డు ఉంటే కోటా బియ్యం కొట్టేయ్యేచ్చా…
*ఆయన పేరుతో చేస్తున్న అరాచకాలు ఏమిటీ…
*ఆయన కే మచ్చతెచ్చిపెడుతుంటే…
ఎవరా పెద్దాయన…ఏమిటీ పోయే కాలం…!
(రామమోహన్ రెడ్డి)
వారంతా ఓకే పాఠశాల లో చదువు కున్న విద్యార్థులే.. అయితే ఒకడు ఒకటో స్థానం ఇంకోకడు రెండో స్థానం ఇలా స్థానాలు వేరయిన అందరూ పేదవాడి బియ్యం ఎలా కొట్టేయ్యాలో అలా కొట్టేయ్యేడానికి వారికి బాగాతెలుసు.అయిన స్వార్థం,అవినీతి సొమ్ము కోసం ఆరాటం…అడ్డగోలు తనానికి నిదర్శనం… బరితెగింపు …విచ్చలవిడి తనం…రౌడీయిజం చెలాయించాలని చూసి చివరికి కుల అహంకారముతో విర్రవీగడం పరిపాటిగా మారింది.ఇదెక్కడో కాదు బెజవాడ కేంద్రం గా జరుగుతున్న రేషన్ మాఫీయా చివరికి బెదిరింపు, భయభ్రాంతులకు ఒకరి నొకరు చేసుకునే స్థాయికి మాఫీయా విస్తరించి పోయింది.ఒకరు పేరుకే శ్రీరామచంద్రుడు కానీ పేదల పొట్టకొట్టి ప్రభుత్వం అందించే కోటా బియ్యం కొట్టేస్తూ తన మాఫీయా సామ్రాజ్యాన్ని నలువైపులా విస్తరించి అతి పెద్ద డాన్ గా అవతరించి శాసించాలని ఆరాటం. ఈ ఆరాటం లో ఎన్నో అరాచకాలు చేయడం పరిపాటిగా మారింది. తన అసకి హద్దు లేక ఆఖరికి కులం కార్డు తో కూటమి ప్రభుత్వం లో కోటా బియ్యం మొత్తాన్ని కొట్టేయ్యాలని ఒక కోటరిని ఏర్పాటు చేసుకున్నాడు.ఆ కోటరీ గురించి ఎవరైన మాట్లాడిన వివరాలు వెల్లడి చేసిన వారిపై అనుచితంగా ప్రవర్తించే స్థాయికి దిగజారి పోయిన పరిస్థితి ఏర్పడింది. తిరువూరు కేంద్రం గా నడుస్తున్న రేషన్ దందా అటు చింతలపూడి వరకు చేరి అక్కడి స్థానిక పోలీసులను తన నోట్ల కట్టలతో కొనేసినట్లు కూడా ప్రచారం చేసుకుంటూ చాట్రాయి, ధర్మజిగూడెం ,ఏలూరు, తిరువూరు, నందిగామ, భవానిపురం ,ఇబ్రహీంపట్నం ,పటమట,కృష్ణలంక ,సింగ్ నగర్,నున్నా ఇలా అనేక ప్రాంతాల్లో కోటా బియ్యాన్ని కొట్టేస్తున్న సంబందిత అధికారులు చూస్తూ ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇక ఈ డాన్ కు కొత్తగా తన సామాజిక వర్గానికి చెందిన ఒక బుల్లి డాన్ కొత్తగా తెరమీదికి వచ్చినట్లు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. పామర్రు లో టు సింగ్ నగర్ కు చేరి బుడమేరు వరదల్లో బురదలో ఉన్న పేదవాడిని కూడా వదలకుండా రేషన్ బియ్యాన్ని దోచుకుని తనకు అడ్డుగా ఉన్న వారి మీద కొన్ని అసత్య కథనాలను ప్రజాభుమి పేపర్ ను మార్ఫింగ్ చేసి దొంగ పనులకు దిగడంతో పాటు ఓ ఆటో డ్రైవర్ కు దాదాపు 2.5 లక్షల సుఫారీ కూడా ఇచ్చి ప్రాణాలు కూడా తీయమని ప్లాన్ వేసినట్లు కూడా వదంతులు కూడా అప్పట్లో వచ్చాయి.ఇలా నేడు డాన్ నరేంద్రగా ఎదిగి ఏవరినైన ఎదురించి మాఫీయా డాన్ గా బెజవాడలో ఎలుబడి సాగించాలని ఏలూరు లో ఉంటూ మాఫీయా ముష్టి కోసం బ్రతికే ఒక జర్నలిస్టు ముసుగులో ఉన్న యుర్నలిస్ట్ బ్రోకర్ గాడిని, రాజమండ్రి లో ఉంటూ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్ గా చలామణి అవుతూ ఇప్పటికే అనేక మార్లు తన్నులు తిన్నా తిక్క కుదరని తిక్క నాయళ్లతో పేపర్ మర్పింగ్ లు, ఫేస్బుక్,వాట్సఫ్ లలో వీరి ఆగడాల గురించి వాస్తవాలు రాసే వారిపై నీచమైన పోస్టులు పెట్టిస్తూ దందా నడుపుతూ ఇటీవల కాలంలో కొత్త రకం దందాకు తెరలేపి నట్లు సమాచారం అందుతోంది.బెజవాడ నిగర్వి, ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుని ప్రజా జీవితంలో ఎంతో ఉన్నతంగా ఉంటూ కేవలం నిస్వార్థ సేవతో రాజకీయా ల్లో ఉన్న ఒక మహోన్నత వ్యక్తి పేరు చెప్పి ఆయన కార్యాలయంలో బద్రీ బద్రీనాధ్ అనే పేరు తో ఈ మాఫీయా గాళ్ళు కొంతమంది చిన్నా చితక వారిపై జులుం ప్రదర్శిస్తూ పుష్ప సినిమా లాగా సిండికేట్ కావాలని బెదిరింపులు కూడ దిగుతున్నట్లు తెలియవచ్చింది. ఇదంతా కేవలము విజిలెన్స్ అధికారులు, పోలీస్, సీవిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం వల్ల నా,లేక వారు కూడా ఈ డాన్ లు చంపేస్తారని భయపడుతూ ఉన్నారా లేక నోట్ల కట్టల కోసం కోటా బియ్యం కొట్టేస్తున్నా చూస్తూ ఉన్నారా అన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలి పోతుంది.ఇలా బెదిరించి బాపట్లలో కోటా బియ్యం కొట్టేసి దాదాపు 40 లక్షల రూపాయలు ఎగనామం పెట్టి నట్లు, నందిగామ లో కూడా ఇలా చేయబోతే అక్కడి కి రాకుండా చేసినట్లు తెలియవస్తోంది.