హిందూపురం టౌన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 20వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పరశురాం గురువారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. నాటకీయ పరిణామాల నడుమ పరశురాం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నాయకులు పరశురాం టిడిపిలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు చివరకు టిడిపిలో చేరడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా టిడిపిలోకి చేరిన పరశురాం మాట్లాడుతూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టిడిపిలో చేరిన హిందూపురం పట్టణ20 వార్డ్ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ పరశురాం, ఈ సందర్భంగా హిందూపురం పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసిపి కౌన్సిలర్ పరశురాంకు టిడిపి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా లను చూసి ఆ పార్టీ నాయకులు ఆ పార్టీలో ఉండలేకపోతున్నారన్నారు త్వరలోనే మరింతమంది టిడిపిలో చేరడం ఖాయమని తెలిపారు అనంతరం కౌన్సిలర్ పరుశురాం మాట్లాడుతూ తన వార్డులో ఇంతవరకు కనీస స్థాయిలో కూడా అభివృద్ధి జరగలేదన్నారు కేవలం పదవులు తప్ప వైకాపాలో అభివృద్ధి లేదన్నారు మరి కొంతమంది కూడా టిడిపిలోకి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన తెలిపారు