వైసీపీ బిసి సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలే..
బీసీ బహిరంగ సభలో పులువర్తి నాని
రామచంద్రపురం
రామచంద్రపురం మండలంలో మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి అధ్యక్షతన బిసి బహిరంగ సభ అట్టహాసంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్పీడ్ పెంచింది. రామచంద్రాపురంలో బిసి’ల బహిరంగ సభ లో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర అన్ని తీసుకోండి ఓటు మాత్రం సైకిల్ కి వేయండి అన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్చార్జి దేవర మనోహర్, మాజీ తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు వెన్నెముక తెలుగుదేశంపార్టీ అని, వారికి అన్నివిధాలా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనే నని అన్నారు. మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర కోట్లు కొద్దిగ డబ్బులు ఉన్నాయని ఆ డబ్బులు మనదే అని అతను ఏమిచ్చినా తీసుకొని ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేయండి అని తెలిపారు. మొట్టమొదట భారతదేశ చరిత్రలో 25 కేంద్రాలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. ఆ తరువాత 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందన్నారు. 33శాతం నుండి 25శాతానికి తగ్గించిన నీచచరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని అన్నారు. వెనుకబడినవర్గాలకు సమాజంలో గుర్తింపు తెచ్చి న ఏకైక పార్టీ తెలుగుదేశం అని పులివర్తి నాని అన్నారు. వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనేదే తెలుగుదేశం లక్ష్యమని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆదరణ పథకం, బీసీ సబ్‌ప్లాన్ తీసుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నేనని చెప్పారు. వైసీపీ బిసి సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలని మండిపడ్డారు. 50 కార్పొరేషన్లు పెట్టి ఆ కార్యాలయాల్లో కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బిసి’ల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీలోకి జోరుగా వలసలు
గంగిరెడ్డిపల్లి గ్రామం బిసి సామాజిక వర్గానికి చెందిన 16 వైసీపీ సానుభూతిపరుల కుటుంబాలు పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. క్రమశిక్షణ, విధానపరమైన సిద్ధాంతాలు, సమస్యల పై పులివర్తి నాని పోరాట పటిమ మిమ్మల్ని పార్టీ వైపు మొగ్గు చూపేలే చేశాయని గంగిరెడ్డిపల్లి, నేన్నురు వైసీపీ సానుభూతిపరులు చెప్పారు. భారీ మెజారిటీతో ఆయన గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో వైస్ సర్పంచ్ రోజా భర్త వాసు, వరదముని, సుబ్రమణ్యం, శ్రీనివాసులు యాదవ్,నవీన్ యాదవ్ , నిమ్మనపల్లి హరీష్, సింగ్ హరీష్
ప్రసాద, బాలయ్య, నాగూర్, హేమంత్, అశోక్
హరి, రవీంద్రబాబు, బాలకృష్ణ, లీలాకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ చౌదరి, చినబాబు, ఉమాపతి నాయుడు, ఢిల్లీ నాథ్ రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.