పోరుమామిళ్ల:
స్థానిక పోరుమామిళ్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మరియు గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాల బాలికలు 663 మందికి పోరుమామిళ్లలోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్. గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు. వీటిని సంస్థ ప్రతినిధులు జి. శ్రీకాంత్ రెడ్డి, ఎల్. ప్రసాద్ రెడ్డి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద పిల్లలకు కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. వీటితోపాటు సంస్థ ద్వారా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరై సంస్థ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.