పులివెందుల టౌన్
ఎన్ని కూటములు ఎదురొచ్చినా, ఎవరు ఎన్ని కుట్రలు పండిన మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వైయస్సార్సీపి కడప జిల్లా ఉపాధ్యక్షుడు డివి శశికాంత్ రెడ్డి యు అన్నా రెడ్డి దినేష్ రెడ్డి లు అన్నారు శనివారం వారు మండలంలోని ఊడవగండ్ల గ్రామంలోని ఎలక్ట్రానిక్ ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పించారు. సోమవారం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా, వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అలాగే గ్రామం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల మేనిఫెస్టోలో ప్రజలకు అన్ని రకాలుగా సేవలు చేశారని ఇంటి వద్దకే పెన్షన్లు విద్యా వైద్యం ఇలా అన్ని రకాలుగా రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ రైతు భరోసా ఇలా అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేశారని రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని కొనియాడారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి పై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వైయస్ఆర్సీపీ తరఫున ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉడవగండ్ల గ్రామ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్ నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున మేనిఫెస్టో ప్రజలు అండగా నిలవాలని కోరారు.