Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఎన్నికల సంవత్సరంలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్రం?ప్రస్తుత బడ్జెట్‌కు మార్చి 31 వరకే చెల్లుబాటు

ఎన్నికల సంవత్సరంలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్రం?ప్రస్తుత బడ్జెట్‌కు మార్చి 31 వరకే చెల్లుబాటు

న్యూఢిల్లీ:‌ప్రస్తుత బడ్జెట్ ఈ ఏడాది మార్చి 31 వరకే చెల్లుబాటు కావడంతో తదుపరి జరిపే ఖర్చులకు నిధుల సేకరణ కోసం పార్లమెంటు అనుమతి తప్పనిసరి. దీంతో, ప్రభుత్వాలు ఎన్నికల సంవత్సరంలో మధ్యంతర బడ్జెట్‌పై పార్లమెంటు అనుమతి తీసుకుంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతుంది.ఏప్రిల్-మే నెలల్లో దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. లోక‌సభ ఎన్నికలు జరిగే సంవత్సరంలో ప్రభుత్వాలు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి.
సాధారణ బడ్జెట్ వలెనే మధ్యంతర బడ్జెట్‌లో కూడా ఖర్చులు, ఆదాయం, ఆర్థికలోటు, ఆర్థిక రంగ స్థితిగతులకు సంబంధించిన అంచనాలు ఉంటాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక అంచనాలు కూడా పొందుపరుస్తారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, మధ్యంతర బడ్జెట్‌లో ఓటర్లను ప్రభావితం చేసేలా పథకాలు ప్రకటించకూడదు. దీంతో ప్రభుత్వాలు ఈ బడ్జెట్‌లో భారీ విధానపరమైన మార్పులను ప్రతిపాదించవు. పన్నుల్లో కూడా పెద్దగా మార్పులు చేర్పులు చేయవు. అయితే, పన్ను విధానానికి చిన్న చిన్న సవరణలు చేయచ్చు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిస్తూ టాక్స్ డిడక్షన్ పరిమితిని పెంచింది.
సాధారణ బడ్జెట్‌కు ముందు ప్రభుత్వాలు పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అయితే, మధ్యంతర బడ్జెట్ విషయంలో మాత్రం ఈ ఆనవాయితీకి మినహాయింపు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article