Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కందికుంట

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కందికుంట

కదిరి :తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సోమవారం తలుపుల మండలం బట్రేపల్లి, కుర్లి పంచాయతీ మూలపల్లి, బట్రేపల్లి, సిద్దుకూరు పల్లి, రెడ్డివారి పల్లి, వీరప్పగారి పల్లిలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రచారంకు వెళ్తున్న కందికుంటకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఆడపడుచులు హారతులు ఇస్తూ గ్రామాలలో పెద్ద ఎత్తున గజమాలతో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్ ప్రజలకు ఓట్లు అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్న కందికుంటకు బ్రహ్మారథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article