హిందూపురంటౌన్ :భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్ యూఐ) జాతీయ కార్యదర్శిగా హిందూ హిందూపురం పట్టణానికి చెందిన సంపత్ కుమార్ నియమిస్తూ జాతీయ అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎఫ్ఎ, ఎఐఎన్ఎఫ్ తో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం పట్టణంలోని ఎన్జీవో హోమ్ లో సంపత్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు హిందూపురం నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం ఉందని, అయితే తొలి సారిగా జాతీయ స్థాయికిళఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి, ఐక్య విద్యార్థి సంఘ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, అఖిలాష్, అభిషేక్, యూత్ కాంగ్రెస్ వంశీ కృష్ణా, జనసేన నాయకులు నిమ్మకాయల రాము తదితరు లు పాల్గొన్నారు.