కూనవరం:కూనవరం మండలం పరిధిలో ఉన్న ఎత్తయిన కొండలపై ఆదివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ వైద్య శిబిరాలు కారుమానుకొండ, పాత కారుమానుకొండ,
గబ్బిలాలగొంది, చింతగండి గ్రామాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి సర్వే చేశారు. ప్రతి ఒక్కరికి రక్త నమూనాలు సేకరించి జ్వరాలు గుర్తించి మందులు ఇచ్చారు.జ్వరాలు ఉన్న వారికీ,ఇతర వ్యాధులు గుర్తించి సుమారు 135 మందికి మందులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటూరు వైద్యాధికారి శ్రీనివాస్ మూర్తి, ఎఎంఓ శ్రీనివాస్ రాజు,సూపర్వాయిజర్స్, హెల్త్ అసిస్టెంట్స్, ఆశాలు పాల్గొన్నారు.

