జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
అనంతపురము
జిల్లాలో ఎం.పీ.ఎఫ్.సీ.(మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్) గోడౌన్ లను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎం.పీ.ఎఫ్.సీ. గోడౌన్ ల నిర్మాణంలో పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎం.పీ.ఎఫ్.సీ. గోడౌన్ లకు సంబంధించి మొదటి దశలో 102 గోడౌన్ లు మంజూరుకాగా, ఇప్పటివరకు 24 గోడౌన్ ల నిర్మాణం పూర్తి కావడం జరిగిందన్నారు. నెలరోజులలోపు మరో 30 గోడౌన్ ల నిర్మాణం పూర్తి చేయాలని, మొత్తం గోడౌన్ లను మార్చి నెలాఖరులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా గోడౌన్ లకు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే పూర్తయిన గోడౌన్లను వెంటనే వ్యవసాయ సహకార సంఘాలకు అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో డీసీఓ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, హార్టికల్చర్ డీడీ రఘునాథరెడ్డి, మార్కెటింగ్ ఏడీ చౌదరి, ఏడీసీసీ బ్యాంక్ సీఈవో రాంప్రసాద్, నాబార్డ్ డీడీఎం అనురాధ, ఫ్యాక్సిల్ డీడీయం, ఫ్యాక్స్ సొసైటీల మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

