లేపాక్షి : మండల కేంద్రమైన లేపాక్షికి సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రధానాచార్యులుగా ఆదివారం సుందర్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ప్రధాన ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రసాద్ బదిలీపై కడప జిల్లా తొండూరు ఎం జె పి గురుకుల పాఠశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ, పలు సంవత్సరాలుగా లేపాక్షి గురుకుల పాఠశాలలో ప్రధాన ఆచార్యులుగా పనిచేసిన నాకు బోధన, బోధనేతర సిబ్బంది తనకు చక్కగా సహకరించారన్నారు. వారికి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా లేపాక్షి ఎం జె పి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల ప్రధాన ఆచార్యులుగా బాధ్యతలు చేపట్టిన సుందర్రాజు మాట్లాడుతూ, లేపాక్షి గురుకుల పాఠశాలలో అందరి సమన్వయం తో పాఠశాలను మరింత అభివృద్ధి పరచేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ సహాయకులు ముస్తఫా తో పాటు అధ్యాపక సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్లిన ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు.